మాజీ సైనికోద్యోగుల నిరసన | - | Sakshi
Sakshi News home page

మాజీ సైనికోద్యోగుల నిరసన

Jun 18 2026 1:47 AM | Updated on Jun 18 2026 1:47 AM

నెహ్రూనగర్‌: దేశ సరిహద్దుల్లో సేవలందించిన మాజీ సైనికుడు కృపారావుపై ఎకై ్సజ్‌ సిబ్బంది దౌర్జన్యానికి పాల్పడిన ఘటనను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాజీ సైనిక ఉద్యోగుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు బుధవారం ఎకై ్సజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయం ముందు సంఘ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రసాద్‌ మాట్లాడుతూ చట్టబద్ధంగా కొన్న మద్యం బిల్లులు, గుర్తింపు కార్డులు ఉన్నా కృపారావును స్టేషనుకు తీసుకెళ్లి వేధించారని ఆరోపించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని, ఆయన విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్లకు తగిన శిక్ష విధించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు ప్రసాద్‌, సలాం, నాగేశ్వరరావు, నాగభూషణం, చిన్న వీరయ్య, సత్తయ్య, మాణిక్యాలరావు, అప్పారావు, వేణుగోపాలరావు, రాకేష్‌, వెంకటరెడ్డి, జోసెఫ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement