బీసీ రిజర్వేషన్లపై వినతుల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

బీసీ రిజర్వేషన్లపై వినతుల స్వీకరణ

Jun 18 2026 1:47 AM | Updated on Jun 18 2026 1:47 AM

బీసీ రిజర్వేషన్లపై వినతుల స్వీకరణ

గుంటూరు వెస్ట్‌: స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి అధ్యయనం నిర్వహిస్తున్న డెడికేషన్‌ కమిషన్‌ చైర్మన్‌ రాజీవ్‌ రంజన్‌ మిశ్రా బుధవారం గుంటూరులోని ఎస్‌.ఆర్‌. శంకరన్‌ హాల్‌లో సమావేశం నిర్వహించారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు, బీసీ సంఘాల నుంచి వినతులు, సూచనలు స్వీకరించారు.

ఈ సందర్భంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్ల కల్పన, బీసీ వర్గాల సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారత, స్థానిక పాలనలో వారి ప్రాతినిధ్యం పెంపు తదితర అంశాలపై అభిప్రాయాలను సేకరించారు. సమగ్రంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్లు రాజీవ్‌ రంజన్‌ మిశ్రా తెలిపారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ, డీఆర్వో షేఖ్‌ ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాస రావు, జిల్లా బీసీ వెల్ఫేర్‌ అధికారి మయూరి, జెడ్పీ సీఈవో జ్యోతిబసు, ఇతర శాఖల జిల్లా అధికారులు, ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీఓలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

బీసీ రిజర్వేషన్లు పెంచాలి

వినతి పత్రం అందజేసిన అనంతరం ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు మాట్లాడుతూ బీసీ కులాల జనగణనను శాసీ్త్రయంగా నిర్వహించి, సుప్రీంకోర్టు 50 శాతం పరిమితిని ఎత్తివేయాలన్నారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లను జనాభా దామాషా మేరకు పెంచేలా ప్రభుత్వానికి సిఫారసు చేయాలన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement