న్యూస్‌రీల్
పులిచింతల సమాచారం
బుధవారం శ్రీ 17 శ్రీ జూన్ శ్రీ 2026
ఓట్లకు ఎసర్ పెడుతున్నారా?
● గుంటూరు నగరంలో
ప్రక్రియ తీరుపై అనుమానాలు
● బీఎల్‌ఓతోపాటు తిరుగుతున్న
టీడీపీ నాయకులు
● వైఎస్సార్ సీపీ వారి ఓట్లను
తొలగించేందుకు ఒత్తిడి?
అధికారం అండగా ప్రతిపక్ష పార్టీకి చెందిన ఓట్లకు టీడీపీ నాయకులు ఎసరు పెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సంఘం చేపట్టిన ‘సర్’ ప్రక్రియ ముఖ్యంగా గుంటూరు నగరంలో అడ్డదిడ్డంగా సాగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. బీఎల్‌ఓను వెంటపెట్టుకుని అధికార పార్టీ నేతలు ఓటర్ల వద్దకు వెళ్లి సర్ దరఖాస్తులు అందిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల బీఎల్‌ఏలకు కనీస సమాచారం ఇవ్వకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
లక్ష్మీపురం: కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన సర్ ప్రక్రియ కొనసాగుతున్న తీరు గుంటూరు నగరంలో అనుమానాలకు తావిస్తోంది. సోమవారం ప్రారంభం అయిన ప్రక్రియను సంబంధిత సచివాలయాలవారీగా బీఎల్‌ఓను నియమించారు. 2025 ఎన్నికల ఓటరు జాబితాల ఆధారంగా గుంటూరు నగరంలోని 57 డివిజన్‌లలో ఉన్న పశ్చిమ నియోజకవర్గ పరిధిలో 291 బూత్‌లు, గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలో 256 బూత్‌లకుగాను మొత్తం 547 మందిని బీఎల్‌ఓలుగా నియమించారు. బీఎల్‌ఓలతోపాటు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన బీఎల్‌ఏలను కూడా ఆయా పార్టీ నాయకులు నియమించారు. నగరంలోని పలు డివిజన్‌లలో బీఎల్‌ఓలతోపాటు వారి వద్ద ఉన్న ఓటరు జాబితాలతో తెలుగుదేఽశం పార్టీకి చెందిన డివిజన్ అధ్యక్షులు, స్థానిక తృతీయ శ్రేణి నాయకులు పాల్గొంటున్నారు. అధికారపార్టీకి చెందిన వారికి మాత్రమే సర్ ప్రక్రియలో భాగంగా సంబంధిత దరఖాస్తులను బీఎల్‌ఓలు అందజేస్తున్నారనే ఆందోళన వ్యక్తం అవుతోంది. బీఎల్‌ఓలతోపాటు తెలుగుదేశం పార్టీ డివిజన్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, తృతీయ శ్రేణి నాయకులు కలసి సర్ ప్రక్రియకు సంబంధించిన దరఖాస్తులను అందజేసి ఫొటోలు దిగుతున్నారు. నిబంధనల మేరకు నిర్వహించాల్సిన సర్ ప్రక్రియ అధికార పార్టీల నేతలకు అనుకూలంగా మారిందని, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన బీఎల్‌ఏలను రానివ్వకుండా నగర వీధుల్లో బీఎల్‌ఓలను తిప్పుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 34వ డివిజన్‌లో బీఎల్‌ఓతో సర్ ప్రక్రియ నిర్వహిస్తున్న సమయంలో టీడీపీ డివిజన్ అధ్యక్షుడు, మైనార్టీ నాయకుడు అక్కడే ఉన్నారు. 34వ డివిజన్‌లో కోబాల్డ్‌పేట 2వ లైనులోని మున్సిపల్ స్కూల్‌లో బీఎల్‌ఓ నుంచి సర్ దరఖాస్తు స్థానిక మహిళకు టీడీపీ డివిజన్ అధ్యక్షుడు అందజేయడంపై విమర్శలు వస్తున్నాయి. సంబంధిత నగరపాలక సంస్థ అధికారులు ఈ బీఎల్‌ఓలపై నియమించిన సూపర్‌వైజర్లు కూడా ఆయా ప్రాంతాలలో తిరుగుతూ పార్టీలకు అతీతంగా ఈ సర్ ప్రక్రియను నిర్వహించాల్సిందిగా నగర వాసులు కోరుతున్నారు. ఇదే తరహాలో బీఎల్‌ఓలు తెలుగుదేశం పార్టీ నాయకులు, డివిజన్ అధ్యక్షులతో కలసి సర్ ప్రక్రియలో భాగంగా దరఖాస్తులు అందజేయడంపై ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికై న జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టి సర్ ప్రక్రియలో పార్టీలకు అతీతంగా నిర్వహించాలని కోరుతున్నారు. స్థానికంగా ఉండే బీఎల్‌ఏలతో కలసి ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి ఓటరుకు దరఖాస్తులు అందజేసేలా చర్యలు తీసుకోవాల్సిందిగా విన్నవిస్తున్నారు.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 33.0520 టీఎంసీలు. ఎగువ నుంచి 4,130 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా, దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు.
ప్రధానంగా గుంటూరు పశ్చిమ నియోజక వర్గ పరిధిలో నియమించిన బీఎల్‌ఓలు కొన్ని డివిజన్‌లలో పాత డోర్ నంబర్లకు బదులు కొత్త డోర్ నంబర్లలో ఉన్న వారికి సంబంధించి సర్ ప్రక్రియను నిర్వహించడం లేదని తెలుస్తోంది. కొంతమంది ఓటరు జాబితాలోని వరుస సంఖ్య ప్రకారం తిరుగుతూ సర్ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. ప్రస్తుత కొత్త డోర్ నంబర్ ప్రకారం నిర్వహించాల్సిన సర్ ప్రక్రియను సమర్థంగా చేపట్టడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత నగరపాలక సంస్థ అధికారులతో తాము మాట్లాడతామని బీఎల్‌ఓలను కొన్ని డివిజన్‌లలో అధికార పార్టికి చెందిన నాయకులు బెదిరిస్తున్నారని సమాచారం. దిక్కుతోచక బీఎల్‌ఓలు సర్ ప్రక్రియను అధికార పార్టీకి చెందిన నాయకులు చెప్పినట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.


