చేబ్రోలు: కలుషిత ఆహారం తినటంతో చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం పాత దళితవాడ ప్రాంతంలో డయేరియా బారిన పడిన వారి పరిస్థితి రెండో రోజు శనివారం కొంత మెరుగుపడింది. తెలుగు బాప్టిస్టు చర్చిలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో చికిత్స పొందుతున్న బాధితుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. సుమారు పదిమందికి సెలెన్ సీసాలు, వైద్య చికిత్సలు అందజేస్తున్నారు. 50 మందికిపైగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను అందజేశారు. బాధితులను డీఎంహెచ్‌వో కే విజయలక్ష్మి, తెనాలి డిప్యూటీ డీఎంహెచ్‌వో అన్నపూర్ణమ్మలు పర్యవేక్షించారు. బృందాలను ఏర్పాటు చేసి ఇంటింటి సర్వే చేపట్టారు. అనుమానితుల వివరాలను నమోదు చేసుకున్నారు. కలెక్టర్ సాయికాంత్ వర్మ ఆదేశాల మేరకు వైద్య చికిత్సలు పొందుతున్న వారికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనాలను అధికారులు ఏర్పాటు చేశారు. పుడ్ సేఫ్టీ అధికారులు స్థానిక చికెన్ షాపులను తనిఖీలు చేశారు. నీటి నమూనాలను సంబంధిత అధికారులు సేకరించి పరీక్షలకు పంపారు. తహసీల్దారు కే శ్రీనివాసశర్మ, చేబ్రోలు, వేజండ్ల, మన్నవ, కొలకలూరు ప్రాంతాలకు చెందిన వైద్యాధికారులు ఎస్‌కే జానీ, రక్షిత్, బాబురావు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
బాధితులకు వైఎస్సార్‌సీపీ నేతల పరామర్శ
చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం దళితవాడ ప్రాంతంలో కలుషిత ఆహారం కారణంగా అస్వస్థతకు గురైన బాధితులను వైఎస్సార్‌సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ శనివారం పరామర్శించారు. వైద్య శిబిరంలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. వైద్యులు అందజేస్తున్న సేవలను తెలుసుకొన్నారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తమవంతు సహాయ, సహాకారాలను అందజేయనున్నట్లు తెలిపారు. డీఎంహెచ్‌వో కే విజయలక్ష్మి, తెనాలి డిప్యూటీ డీఎంహెచ్‌వో అన్నపూర్ణమ్మలతో మాట్లాడి మెరుగైన వైద్య చికిత్సలు అందజేయాలని సూచించారు. హైకోర్టు అడ్వకేట్ కన్నా రజని. స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు కొల్లి శేషిరెడ్డి, గాదె కేశవరెడ్డి, వై. మమత, రవీంద్ర, ఆర్. వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
రెడ్ బుక్ పాలన
పొన్నూరు: నియోజకవర్గంలో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ రెడ్ బుక్ పాలన సాగిస్తున్నారని, అక్రమ కేసులతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని హైకోర్టు న్యాయవాది కన్నా రజని ఆరోపించారు. మండలంలోని మామిళ్లపల్లి గ్రామంలో టీడీపీ నాయకుల దాడి కారణంగా నష్టపోయి, అక్రమ కేసులు ఎదుర్కొంటున్న మొక్కజొన్న రైతులకు శనివారం ఆమె సంఘీభావం తెలిపారు. రైతు సముద్రయ్య గోడౌన్‌ను పరిశీలించారు.
కొత్తరెడ్డిపాలెంలో కొనసాగుతున్న
ప్రత్యేక వైద్య శిబిరం


