పెదకాకాని: భారతీయ జనతా పార్టీ జాతీయవాదానికి, విలువలతో కూడిన రాజకీయాలు, లౌకికవాదానికి కట్టుబడి ఉంటుందని రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. పెదకాకాని మండలంలోని నంబూరు వీవీఐటీ విశ్వవిద్యాలయంలో రెండు రోజుల పాటు ఈ శిక్షణ తరగతులు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని మొదటి రోజు జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు ప్రారంభించారు. ముఖ్యఅతిధిగా హాజరై మాధవ్ సైద్ధాంతిక పునాది అనే అంశం పై మాట్లాడారు. అనంతరం పలు అంశాలపై నాగోతు రమేష్‌నాయుడు, డాక్టర్ సుహాసిని ఆనంద్, చంద్రమౌళి, అభిలాష్ మాట్లాడారు. సమావేశంలో జిల్లా ప్రశిక్షణ ప్రబారి రాంపల్లి జగన్నాథశాస్త్రి, జిల్లా ప్రశిక్షణ కన్వీనర్ భీమినేని చంద్రశేఖర్, బిట్ర శివన్నారాయణ, జూపూడి రంగరాజు, మకుటం శివ, దర్శనపు శ్రీను, చిడిపోతు యశ్వంత్, కొత్తూరు వెంకట సుబ్బారావు, యడ్లపాటి స్వరూపరాణి, ఈదర శ్రీనివాసరెడ్డి, కొక్కెర శ్రీనివాస్ పాల్గొన్నారు.


