మంగళగిరిటౌన్: చైనాలో ఈ నెల 10 నుండి 15వ తేదీ వరకు జరిగిన ఏషియన్ సబ్ జూనియర్ అండ్ జూనియర్ (మెన్ అండ్ ఉమెన్) క్లాసిక్ అండ్ ఎక్యూప్డ్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో గుంటూరు జిల్లా క్రీడాకారిణి ప్రతిభ చాటి మెడల్స్ సాధించినట్లు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు విజయభాస్కరావు తెలిపారు. మంగళగిరిలోని వారి కార్యాలయం నుంచి శుక్రవారం వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మధిర షానూన్ ఈ పోటీల్లో 47 కేజీల విభాగంలో పాల్గొని బ్రాంజ్ మెడల్ సాధించినట్లు పేర్కొన్నారు. షానూన్ ఉత్తమ ప్రదర్శన చేసి పతకం సాధించడం ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. దేశానికి, రాష్ట్రానికి, జిల్లాకు పతకాలు సాధించి పేరు తీసుకువచ్చిన షానూన్‌ను పవర్ లిఫ్టింగ్ ఇండియా అధ్యక్షులు సతీష్‌కుమార్ తదితర అసోసియేషన్ సభ్యులు అభినందించినట్లు పేర్కొన్నారు.
పెదకాకాని: చరిత్ర పుస్తకాలు మన సంస్కృతి, సంప్రదాయాలను భావి తరాలు తెలుసుకునేందుకు దోహదపడతాయని వర్సిటీ ఇన్‌చార్జి వీసీ ఆచార్య కె.గంగాధరరావు అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వలయంలో శుక్రవారం గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ప్రముఖ బాల సాహితీవేత్త, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ షేక్ అబ్దుల్ హకీంజానీ రచించిన మన కవుల చరిత్ర మొదటి భాగం గ్రంథాన్ని వీసీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 70కి పైగా పుస్తకాలను రచించిన అబ్దుల్ హకీంజానిని అభినందించారు. ఈ సందర్భంగా హకీంజానీ మాట్లాడుతూ 500 పేజీలకు పైగా మన కవుల చరిత్ర రెండవ విభాగం త్వరలో వెలువడుతుందన్నారు.
మరొకరికి గాయాలు
మంగళగిరి టౌన్: బైక్‌ను కారు వెనుక నుంచి బలంగా ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందడంతో పాటు మరొకరు గాయపడిన ఘటన శుక్రవారం పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలు.. దుగ్గిరాల మండలం చిలువూరుకు చెందిన పసుపులేటి మధుబాబు(50) శుక్రవారం పని నిమిత్తం ఆత్మకూరు వచ్చాడు. తిరిగి చిలువూరు వెళ్లే క్రమంలో నంబూరు మీదుగా వెళ్లేందుకు మంగళగిరి జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేస్తున్నాడు. ఈ క్రమంలో విజయవాడ వైపు నుంచి వస్తున్న కారు మంగళగిరి పట్టణ పరిధిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి కాలనీ జాతీయ రహదారి వద్దకు వచ్చేసరికి ఎదురుగా వెళుతున్న మధుబాబు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. కారు, బైక్ రెండూ అదుపుతప్పి సర్వీస్‌రోడ్ నుంచి కిందకు ఎగిరిపడ్డాయి. బైక్‌పై ప్రయాణిస్తున్న మధుబాబు అక్కడికక్కడే తీవ్ర గాయాలతో మృతి చెందగా, కారులో ప్రయాణిస్తున్న ఆదినారాయణకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మధుబాబు ఓ ప్రైవేటు బ్యాంకులో అటెండర్‌గా పనిచేస్తున్నాడు. నేషనల్ హైవే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంగళగిరి పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక పోలీసులు మధుబాబు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళగిరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


