అధరగొడుతున్న కుర్రాళ్లు! | - | Sakshi
Sakshi News home page

అధరగొడుతున్న కుర్రాళ్లు!

Apr 29 2026 8:12 AM | Updated on Apr 29 2026 8:12 AM

అధరగొడుతున్న కుర్రాళ్లు!

ఏపీఎల్‌లో జిల్లా నుంచి 16 మందికి అవకాశం గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలోనే టోర్నీ ప్రారంభం

కొమ్మినేని మహీప్‌కుమార్‌ (రైట్‌ హ్యాండ్‌ బ్యాటర్‌)

గుంటూరు వెస్ట్‌ (క్రీడలు): ఒకప్పుడు క్రికెట్‌ అంటే రంజీ ట్రోఫీ ఆడిన వారికి కొంత నగదు వచ్చేది. తర్వాత ఐపీల్‌ వంటి మెగా టోర్నమెంట్‌లలో అవకాశం దక్కితే మరింత ఆర్థిక భరోసా లభించేది. ప్రస్తుతం జిల్లా స్థాయి క్రికెటర్లకు కూడా రూ.లక్షలు సంపాదించేలా ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ మార్చేసింది. ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌ (ఏపీఎల్‌) పేరిట ప్రతి ఏడాది జరుగుతున్న వేలంలో జిల్లా స్థాయి నుంచి రంజీ స్థాయి వరకు ఉత్తమ ప్రతిభ కనబరచిన వారిని స్థాయిని బట్టి ఫ్రాంచైజీలు కొనుగోలు చేస్తున్నాయి. ఇటీవల విశాఖలో జరిగిన వేలంలో గుంటూరు జిల్లా నుంచి 16 మంది ఎంపికయ్యారు. చెన్ను సిద్ధార్థను రూ.11.25 లక్షలకు, షేక్‌ రషీద్‌ను రూ.11 లక్షలకు, గద్దె సమన్విత్‌ను రూ.8 లక్షలకు, మామిడి వంశీకృష్ణను రూ.6 లక్షలకు, కొమ్మినేని మహీప్‌కుమార్‌ను రూ.5.5 లక్షలకు, కేపీ సాయి రాహుల్‌ను రూ.5.5 లక్షలకు, శంబు అఖిల్‌ను రూ.2.80 లక్షలకు ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్నాయి. 2022లో ఏపీఎల్‌ను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏసీఏ అధ్యక్ష, కార్యదర్శులు శరత్‌ చంద్రారెడ్డి, గోపీనాథ్‌రెడ్డిలు ప్రారంభించారు. ఆర్థిక చేయూత అందించారు.

వేలంలో పలికిన ధర: రూ.5.5 లక్షలు

జట్టు : సింహాద్రి వైజాగ్‌ లయన్స్‌

ప్రత్యేకతలు: 2022 నుంచి ఏపీఎల్‌ ఆడుతున్నాడు. అండర్‌– 16 నుంచి అండర్‌–20, 23 వరకు స్టేట్‌ క్రికెట్‌ జట్టులో ఆడుతున్నాడు. 2023 నుంచి ఆంధ్రా రంజీ జట్టులో కొనసాగుతున్నాడు. 2025లో విజయ్‌ హజారే టోర్నమెంట్‌ ఆడాడు.

Advertisement
 
Advertisement
Advertisement