బీసీ బాలికల వసతి గృహాన్ని సందర్శించిన న్యాయమూర్తి | - | Sakshi
Sakshi News home page

బీసీ బాలికల వసతి గృహాన్ని సందర్శించిన న్యాయమూర్తి

Mar 31 2026 8:38 AM | Updated on Mar 31 2026 8:38 AM

బీసీ బాలికల వసతి గృహాన్ని సందర్శించిన న్యాయమూర్తి పాస్టర్ల సంక్షేమానికి కృషి పాలిసెట్‌, ఏపీ ఆర్జేసీ ప్రవేశ పరీక్షలకు ఉచిత శిక్షణ

సత్తెనపల్లి: పట్టణంలోని రఘురామ్‌నగర్‌లో గల ప్రభుత్వ బాలికల వసతి గృహాన్ని సత్తెనపల్లి ప్రధాన సివిల్‌ జడ్జి (జూనియర్‌ డివిజన్‌ )థౌషిద్‌ హుస్సేన్‌ సోమవారం సందర్శించారు. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు, సత్తెనపల్లి మండల న్యాయ సేవాధికార కమిటీ చైర్మన్‌, సత్తెనపల్లి సివిల్‌ జడ్జి (సీనియర్‌ డివిజన్‌ ) వి.విజయ్‌కుమార్‌రెడ్డి సూచనల మేరకు వసతి గృహం విద్యార్ధినిలకు పలు చట్టాలపై అవగాహన కల్పించారు. ముందుగా న్యాయమూర్తి థౌషిద్‌ హుస్సేన్‌ వసతి గృహంలో పరిసరాలను పరిశీలించారు. విద్యార్ధినిలకు అందిస్తున్న ఆహారం, అవసరమైన సరకులు నాణ్యతను పరిశీలించారు. విద్యార్థినిలకు అందాల్సిన సౌకర్యాలు, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో న్యాయవాదులు దివ్వెల శ్రీనివాసరావు, గంటా వెంకటశివ, బుర్రి సైదయ్య, పారా లీగల్‌ వాలంటీర్‌ షేక్‌ సుభాని, వసతి గృహ అధికారిణి ఎం.ఇందిరాగాంధీ, కోర్ట్‌ సిబ్బంది పాల్గొన్నారు.

పాస్టర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సమావేశంలో నాయకులు

తెనాలి రూరల్‌: పాస్టర్ల సంక్షేమానికి పాస్టర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ కృషి చేస్తుందని అసోసియేషన్‌ నాయకులు తెలిపారు. అసోసియేషన్‌ మార్చి నెల సమావేశాన్ని పట్టణంలోని కల్వరి కృప చర్చిలో సోమవారం నిర్వహించారు. అసోసియేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షులు బిషప్‌ డాక్టర్‌ పినపాటి జాన్‌పాల్‌, గౌరవాధ్యక్షుడు డాక్టర్‌ కత్తెర సురేష్‌కుమార్‌ మాట్లాడుతూ పాస్టర్లు నిబద్దతతో సేవ చేయాలని, ఐక్యతతో ముందుకు సాగాలని సూచించారు. అసోసియేషన్‌ నియమ నిబంధనలకు అనుగుణంగా నడుచుకునే పాస్టర్లకు అసోసియేషన్‌ అండగా ఉంటుందన్నారు. అసోసియేషన్‌ ద్వారా అందరికీ సహాయ సహకారాలు అందిస్తున్నామని, అవసరతలో ఉన్న దైవ సేవకులకు ఆర్థిక చేయూత సైతం అందజేసే విధంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అన్న సూక్తి ప్రకారం అసోసియేషన్‌ లోని ప్రతి సభ్యుడికి సహాయ సహకారాలు అందించే విధంగా కృషి చేస్తామన్నారు. పాస్టర్లకు దేవుని సువార్త అందించటమే ప్రధాన లక్ష్యంగా ఉండాలన్న అభిప్రాయాన్ని తెలియజేశారు. దేవునిపై నమ్మకం ఉంచి దేవుని సేవ చేసే వారికి ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయన్నారు. అసోసియేషన్‌ కార్యనిర్వాహక కార్యదర్శి రెవరెండ్‌ మల్లవరపు విజయ్‌ కుమార్‌, జె.ప్రభుదాస్‌, చిలక జాన్‌ వరప్రసాదరావు, అన్నం ఆదాం, విలియం కేరి, గడ్డం జాన్‌బాబు, ఎం.షడ్రక్‌, పొదిల ఏసోబు, శ్రీకాంత్‌, రజనీకాంత్‌, ఎం.షాలేమ్‌రాజు, తూమాటి రత్నరాజు తదితరులు పాల్గొన్నారు.

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఎన్నారై ఇంజనీరింగ్‌ కళాశాల ఆధ్వర్యంలో పదవ తరగతి పూర్తిచేసిన విద్యార్థులకు ఉచిత పాలిసెట్‌, ఏ.పి.ఆర్‌.జె.సి. శిక్షణ తరగతులను నిర్వహించనున్నట్లు ఎన్నారై విద్యాసంస్థల ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పిడికిటి తిలక్‌ బాబు తెలియజేశారు. కార్యక్రమంలో భాగంగా ఉచిత శిక్షణ తరగతులకు సంబంధించిన కరపత్రాలను విద్యానగర్‌లోని ఎన్నారై ఇంజనీరింగ్‌ కళాశాల సిటీ కార్యాలయంలో సోమవారం విడుదల చేశారు. ఉచిత శిక్షణ తరగతులను ఏప్రిల్‌ 3న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతిరోజూ 2 గంటల పాటు మాథమ్యాటిక్స్‌, గంట ఫిజిక్స్‌, గంట కెమిస్ట్రీ, కోచింగ్‌ పూర్తయ్యేలోపు మూడు పాలిసెట్‌, ఏ.పి.ఆర్‌.జె.సి గ్రాండ్‌ టెస్టుల నిర్వహణ జరుగుతుందని తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు తమవివరాలను 8885995458, 9502054168, 9398788336 నెంబర్లకు ఫోన్‌ చేసి వెంటనే రిజిస్టర్‌ చేసుకోవచ్చని తెలిపారు.

వీటితోపాటు ఏ.పి.ఆర్‌.జె.సి. ఎంట్రన్స్‌ రాసుకునే ఆంగ్లంలో, బయాలజీలోనూ ప్రత్యేకశిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ముందుగా రిజిష్టర్‌ చేసుకున్న 200 మంది విద్యార్థులకు ఉచితంగా మెటీరియల్‌ అందజేయడం జరుగుతోందన్నారు. ఈ కోచింగ్‌ గుంటూరులోని మూడు ప్రధాన సెంటర్లు కొత్తపేట, విద్యానగర్‌లలో ఉన్న ఎన్నారైస్‌, ఇండియన్‌ స్ప్రింగ్స్‌ స్కూల్స్‌లో, విశదలలోని ఎన్నారై ఇంజనీరింగ్‌ కళాశాలలో నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎన్నారైస్‌, ఇండియన్‌ స్ప్రింగ్స్‌ స్కూల్‌ ప్రిన్సిపల్స్‌ వట్టికూటి నవీన్‌ చౌదరి, కె.బాలకృష్ణ, ఏజీఎం బొర్రా భాను ప్రసాద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement