ఆంధ్రప్రదేశ్ మ్యాథ్స్ ఫోరం పల్నాడు జిల్లా శాఖ అధ్యక్షుడిగా షేక్ షాహిద్ బాషా(చిలకలూరిపేట) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సత్తెనపల్లిలోని సుగాలి కాలనీ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ మ్యాథ్స్ ఫోరం (ఏపీఎంఎఫ్) జిల్లా కార్యవర్గ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. ప్రధానకార్యదర్శిగా పి.వీరబ్రహ్మం(నాదెండ్ల), ట్రెజరర్‌గా పి.సత్యనారాయణరాజు(పాకాలపాడు), గౌరవఅధ్యక్షుడిగా రామిశెట్టి గోవిందరాజులు(నరసరావుపేట), ఉపాధ్యక్షులుగా కె.జగన్నాధరావు (ముప్పాళ్ళ), జూపల్లి గంగాధర్‌బాబు (మాచర్ల), ఎల్.రామాంజిరెడ్డి (వినుకొండ), ఎ.భాగేశ్వరీదేవి (మాదల), ఎం.ఫణికుమార్ (నరసరావుపేట), కార్యదర్శులుగా ఈ పున్నమ్మ (అచ్చంపేట), జాన్‌కెనడి (మాచర్ల), కె.శ్రీనివాసరావు(చిలకలూరిపేట), ఎస్.ఆదినారాయణ(యడ్లపాడు), ఎం.శ్రీనివాసరెడ్డి(రొంపిచర్ల), సిహెచ్.నాగేశ్వరరావు(వినుకొండ), ఎ.వెంకటశ్రీవత్స(కారంపూడి), జెవికె ప్రసాద్(రెంటచింతల), కె.శివనాయక్ (ఈపూరు), పి.రఘునాథబాబు (శావల్యపురం), బి.శివకోటేశ్వరరావు(దుర్గి), జి ప్రతాప్(బొల్లాపల్లి), కె.రాంబాబు (క్రోసూరు) ఎన్నికయ్యారు. జిల్లా అడ్వైజరీ కమిటీ బాధ్యులుగా కె.వి.రమణ (పెదమక్కెన), ఎ.శ్రీనివాసరెడ్డి (వెన్నాదేవి), పీవీ కోటేశ్వరరావు (సత్తెనపల్లి), బట్టు ఉదయ్‌భాస్కర్ (నరసరావుపేట), ీపి.విజయ్‌కుమారి (దుర్గి), పి.అంజనీకుమారి(నకరికల్లు), కె.వేణుగోపాలరావు(ముప్పాళ్ళ), ఎం.నరేంద్రకుమార్ (సత్తెనపల్లి) ఎన్నికయ్యారు.


