జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా
గుంటూరు రూరల్: స్వచ్ఛతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా తెలిపారు. శనివారం పెదపలకలూరు రోడ్డులోని విజ్ఞాన్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో నగర కమిషనర్ కె. మయూర్ అశోక్‌తో కలిసి పాల్గొన్నారు.
కులం పేరుతో దూషణపై కేసు నమోదు
తెనాలి రూరల్: కులం పేరుతో దూషణపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. దళితుల్లోని రెండు సామాజికవర్గాలను అసభ్యంగా దూషిస్తూ మండలంలోని ఖాజీపేట గ్రామానికి చెందిన చల్లా నాగరాజు శుక్రవారం ఫేస్‌బుక్‌లో లైవ్ వీడియో పెట్టాడు. తిరిగి రాత్రి క్షమాపణ కోరుతూ మరో లైవ్ వీడియో పోస్టు చేశాడు. దీనిపై రూరల్ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. ఇప్పటికే నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం.


