అత్యుత్తమ సేవలే మెడ్‌స్టార్‌ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

అత్యుత్తమ సేవలే మెడ్‌స్టార్‌ లక్ష్యం

Mar 24 2026 8:02 AM | Updated on Mar 24 2026 8:02 AM

అత్యుత్తమ సేవలే మెడ్‌స్టార్‌ లక్ష్యం

లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆంధప్రదేశ్‌లోనే అడ్వాన్స్‌డ్‌ మెడికల్‌ ఎకోసిస్టమ్‌తో రోగి కేంద్రిత వైద్య సేవలకు కొత్త ప్రమాణాలు సృష్టిస్తూ మెడ్‌స్టార్‌ ఆస్పత్రిని మంగళవారం లాంఛనంగా ప్రారంభించనున్నట్లు ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్ట్‌, ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బి.విజయ చైతన్య తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆశ్రమం రోడ్డులో ఏర్పాటు చేసిన ఆస్పత్రిలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ ఆస్పత్రిలో ఫిలిప్స్‌ అజ్యూరియన్‌ 7ఎం 20 హైబ్రిడ్‌ క్యాథ్‌ల్యాబ్‌ను రాష్ట్రంలోనే తొలిసారిగా అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. దీని ద్వారా అత్యాధునిక 3డీ ఇమేజింగ్‌, తక్కువ రేడియేషన్‌ సాంకేతికతతో హైబ్రిడ్‌ ప్లాట్‌ఫారమ్‌ ద్వారా గుండె, రక్తనాళాలు, ఎండో వాస్క్యులర్‌ సంబంధిత క్లిష్టమైన శస్త్రచికిత్సలను అత్యంత కచ్చితత్వం, భద్రతతో నిర్వహించొచ్చని పేర్కొరు. ఫిలిప్స్‌ 3డీటీ (ట్రాన్స్‌ ఈసోఫేజియల్‌ ఎకోకార్డియోగ్రఫీ) సిస్టమ్‌ అందుబాటులో ఉందన్నారు. ఇది గుండె నిర్మాణాన్ని రియల్‌ టైమ్‌లో, హై–రిజల్యూషన్‌ 3 ఈ రూపంలో చూపిస్తూ క్లిష్టమైన హార్ట్‌ వాల్వ్‌, స్ట్రక్చరల్‌ హార్ట్‌ ప్రొసీజర్స్‌ సమయంలో కచ్చితమైన నిర్ధారణ మార్గదర్శకత్వాన్ని అందిస్తుందని వివరించారు. గ్యాస్ట్రో ఎంటరాలజీ, పల్మనాలజీ విభాగాల్లో అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి తెచ్చామన్నారు. ఆస్పత్రిలో మొత్తం వైద్య వ్యవస్థను గార్డియన్‌ సాఫ్ట్‌వేర్‌ అనలిటిక్స్‌ ఆధారిత ఇంటెలిజెంట్‌ మానిటరింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ సమన్వయం చేస్తుందని, ఇది రోగుల ఆరోగ్య స్థితిని రియల్‌ టైమ్‌లో పర్యవేక్షిస్తూ, ప్రమాద సంకేతాలను ముందుగానే గుర్తించి, వైద్య బృందం స్పందన వేగాన్ని పెంచుతుందని తెలిపారు. దీని ద్వారా నిరంతర, డేటా ఆధారిత వైద్య సేవలు అందు తాయని పేర్కొన్నారు. ఈ ఆస్పత్రిని రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ మంగళవారం ప్రారంభిస్తారని, ఈ కార్యక్రమంలో వైద్యశాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్‌ పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో ఆస్పత్రి డైరెక్టర్‌ పరుచూరి సాయికుమార్‌, సీటీ సర్జన్‌ డాక్టర్‌ పి.వి.నరేష్‌, నెఫ్రాలజిస్ట్‌ అండ్‌ మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వై.రమేష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement