పెట్టుబడుల పేరుతో మోసం | - | Sakshi
Sakshi News home page

పెట్టుబడుల పేరుతో మోసం

Mar 24 2026 8:02 AM | Updated on Mar 24 2026 8:02 AM

ఆధ్యాత్మికవేత్తపై చర్యలు తీసుకోవాలి.. రైతులకు తెలియకుండా... రూ.కోట్లతో పరారీ..

నగరంపాలెం: పెట్టుబడుల పేర్లతో మోసగించారని, రైతులకు తెలియకుండా మిర్చి బస్తాలు విక్రయించారని ఒకరూ సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయ ఆవరణలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. బాధితుల నుంచి జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఫిర్యాదులను స్వీకరించారు. వారి విన్నపాలను జిల్లా ఎస్పీ ఆలకించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ స్థానిక పోలీస్‌ సబ్‌ డివిజన్లు, పోలీస్‌ స్టేషన్లల్లోనూ ఫిర్యాదు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఆన్‌లైన్‌ ద్వారా meekos am.ap.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. ఫిర్యాదుల స్థితిగతులను తెలుసుకునేందుకు 1100 టోల్‌–ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేయవచ్చునని చెప్పారు. జిల్లా ఏఎస్పీ సుప్రజ (క్రైం), డీఎస్పీలు బెల్లం శ్రీనివాసరావు (ట్రాఫిక్‌), శ్రీనివాసరెడ్డి (మహిళా పీఎస్‌), మధుసూదన్‌రావు (సీసీఎస్‌) ఫిర్యాదులు స్వీకరించారు.

ఇటీవల సోషల్‌ మీడియా వేదికగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధుల మధ్యాహ్నా భోజనంపై వ్యాఖ్యలు చేసిన ఆధ్యాత్మిక ప్రవచనకర్తపై చర్యలు చేపట్టాలి. పిల్లలను శోభనం పెళ్లి కొడుకులుగా కించపరిచేలా మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాల్లో తొంభై శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల విద్యార్థులు చదువుకుంటారు. విద్యార్ధుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడిన ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

– మాల మహనాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్‌కుమార్‌, దార్ల అర్జున్‌కుమార్‌, నాయకులు

సుమారు రెండేళ్ల క్రితం రైతులకు సంబంధించి 1,800 మిర్చి బస్తాలను చిలకలూరిపేట రోడ్డులోని ఓ కోల్డ్‌స్టోరేజీలో నిల్వ చేశాం. అయితే రైతులకు తెలియకుండా 1,500 బస్తాలను కోల్ట్‌స్టోరేజీ నిర్వాహకులు విక్రయించారు. సుమారు రెండు నెలలు క్రితం రైతులు వెళ్లి విచారించగా, సదరు నిర్వాహకులు విక్రయించినట్లు బయటపడింది. దాదాపు విక్రయించిన సరుకు సుమారు రూ.కోటి వరకు ఉంటుంది. న్యాయం చేయగలరు.

– గరిగంటి వెంకటేశ్వర్లు, ఈశ్వరీ ట్రేడింగ్‌ కంపెనీ నిర్వాహకులు

గుంటూరు అరండల్‌పేటలో సుమారు రెండేళ్లుగా ఓ ప్రైవేట్‌ కంపెనీ నిర్వహిస్తున్నారు. ఒక్కసారి రూ.లక్ష పెట్టుబడి చెల్లిస్తే నెలకు రూ.10 వేలు చొప్పున 20 నెలలు చెల్లిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ క్రమంలో దాదాపు తెలుగు రాష్ట్రాల్లో రెండు వేల మందికి పైగా చెల్లించారు. మొదట్లో చెల్లింపులు పద్ధతిగా చేశారు. అయితే నెల నెలా చెల్లింపుల్లో ఆలస్యమవగా అనుమానం వచ్చి కార్యాలయం వద్దకు వెళ్లాం. అక్కడకు వెళ్తే నిర్వాహాకులు పారిపోయారని తెలిసింది. దాదాపు రూ.వంద కోట్ల మేరకు కుచ్చుటోపీ పెట్టి పరారయ్యారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనంలేదు. న్యాయం చేయగలరు.

– బాధితులు నిజామ్‌, అనీల్‌,

శ్రీనివాస్‌, షేక్‌ సైదా

పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసిన బాధితులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement