గోవాడ కోటయ్యస్వామికి మహాశివరాత్రి ఆదాయం
వేమూరు: గోవాడ గంగా పార్వతీ సమేత బాల కోటేశ్వర స్వామి మహాశివరాత్రి తిరునాళ్లుకు రూ.53,04,785 ఆదాయం వచ్చినట్లు దేవస్థానం ఈవో శ్రీనివాస్ వర్మ గురువారం వెల్లడించారు. అమర్తలూరు మండలం గోవాడ బాల కోటేశ్వర స్వామి దేవస్థానంలో మహా శివరాత్రి హుండీ లెక్కింపు గురువారం నిర్వహించారు. హుండీ ద్వారా రూ.16,33,235, అభిషేకం ద్వారా రూ.8,85,100, దర్శనం ద్వారా రూ.10,46,450, ఖాళీ స్థలం, కొబ్బరి కాయలు, కొబ్బరి చిప్పల ద్వారా రూ. 18,40,000, ఆదాయం వచ్చిందని ఆయన తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో చీఫ్ ఫెస్టివల్ అధికారి వి.అనుపమ, ఎంపీడీవో మారుతీ శేషంబా, గ్రామ సర్పంచ్ మండవ విజయలక్ష్మి, దేవస్థానం చైర్మన్ పావులూరు రమేష్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
కానుకలు లెక్కిస్తున్న సిబ్బంది


