వైఎస్సార్‌సీపీలో పలువురికి పదవులు
పట్నంబజారు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాకు సంబంధించి పలువురిని పలు పదవుల్లో నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.
వివరాలు ఇవీ...
వైఎస్సార్‌సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన షేక్ పొన్నూరు కరీముల్లా, రాష్ట్ర యువజన విభాగం సహాయ కార్యదర్శిగా మంగళగిరి నియోజకవర్గానికి చెందిన ఉడారపు గోపీనాథ్, గ్రీవెన్స్ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా తాడికొండ నియోజకవర్గానికి చెందిన పుట్టి సుబ్బారావు, ప్రచార విభాగం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన యర్రం హనిమిరెడ్డి, వలంటీర్స్ విభాగం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన రాచకొండ ముత్యాలరాజు నియమితులయ్యారు. గుంటూరు జిల్లా బీసీ విభాగం ఉపాధ్యక్షులుగా గుంటూరు నగరానికి చెందిన సిరిబోయిన అవినాష్, ఉప్పల శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా కొండా రవి, వైఎస్సార్‌టీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడిగా తెనాలి నియోజకవర్గానికి చెందిన వేమూరి కిషోర్, వైఎస్సార్‌టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన చాగంటి విష్ణువర్ధన్‌రెడ్డి, మంగళగిరికి చెందిన కొప్పుల తిరుమలేశ్వరరావు, ఎగ్జిక్యూటీవ్ మెంబర్‌గా తెనాలికి చెందిన అమర్తలూరి ఆనంద్, వలంటీర్స్ విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెందిన తోటకూర స్వర్ణలత, పబ్లిసిటీ విభాగం జిల్లా ఉపాధ్యక్షుడిగా తెనాలికి చెందిన బొంతు నరేంద్రరెడ్డి, ప్రచార విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి మంగళగిరికి చెందిన డోకిపర్తి శ్రీనివాసరావు, కార్యదర్శులుగా తెనాలికి చెందిన మాదినేని శ్రీనివాసరెడ్డి, షేక్ సలీం, పంచాయతీరాజ్ విభాగం జిల్లా ఉపాధ్యక్షుడిగా తెనాలికి చెందిన మండ్రు రాజు, కార్యదర్శులుగా తెనాలికి చెందిన కుక్కల ముక్తేశ్వరరావు, బచ్చు రాఘవరావు, యువజన విభాగం జిలాల ప్రధాన కార్యదర్శిగా తెనాలికి చెందిన బడుగు కోటయ్య, మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శులుగా మంగళగిరికి చెందిన షేక్ హిజార్ సుభాని, పశ్చిమ నియోజకవర్గానికి చెందిన షేక్ షరీఫుద్దీన్, కార్యదర్శిగా షేక్ ఉమర్ వలి, ఎస్సీ విభాగం ప్రధాన కార్యదర్శులుగా మంగళగిరికి చెందిన ఎన్.శామ్యూల్, ప్రత్తిపాడుకు చెందిన మన్నవ మహేంద్రబాబు, పశ్చిమ నియోజకవర్గానికి చెందిన నేలటూరి సుందరరావు, కార్యదర్శులుగా ప్రత్తిపాడుకు చెందిన మెరిగల మోహన్‌రావు, పశ్చిమ నియోజకవర్గానికి చెందిన బక్కా మనోజ్‌కుమార్ నియమితులయ్యారు.
ఎగ్జిక్యూటీవ్ మెంబర్లుగా...
ఎగ్జిక్యూటీవ్ మెంబర్లుగా ప్రత్తిపాడుకు చెందిన దాసరి నాగరాజు, బొక్కా శివయ్య, పశ్చిమ నియోజకవర్గానికి చెందిన చెరుకూరి బాలస్వామి, జిల్లా దివ్యాంగుల విభాగం ప్రధాన కార్యదర్శిగా తూర్పు నియోజకవర్గానికి చెందిన సయ్యద్ యూసఫ్, జిల్లా గ్రీవెన్స్ విభాగం ప్రధాన కార్యదర్శిగా తెనాలికి చెందిన కనపర్తి అనిల్, కార్యదర్శులుగా కాళిదాసు వెంకటేశ్వరరావు, షేక్ అజ్మల్, ఎగ్జిక్యూటీవ్ మెంబర్‌గా రెడ్డి శ్రీనివాసరావు, జిల్లా బూత్ కమిటీ విభాగం ప్రధాన కార్యదర్శిగా పరుసు రాజ్‌కుమార్, కార్యదర్శిగా మొవ్వా కాశిరెడ్డి, జిల్లా యువజన విభాగం కార్యదర్శిగా మాగులూరి పవన్‌దీప్‌రెడ్డి, ఎగ్జిక్యూటీవ్ మెంబర్‌గా షేక్ జాకీర్ హుస్సేన్, మహిళ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా తెనాలికి చెందిన షేక్ జకీర, కార్యదర్శిగా షేక్ నాగూర్‌బీ, ఎగ్జిక్యూటీవ్ మెంబర్‌గా ఎం.ఇందిరప్రియదర్శిని, విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా నలుకుర్తి ఉదయ్‌కాంత్, కార్యదర్శులుగా పాటిబండ్ల హోసన్న, మండిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎగ్జిక్యూటీవ్ మెంబర్లుగా మంచాల సుకుమార్ నియమితులయ్యారు.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో..
అదేవిధంగా గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి నగర ఎస్సీ విభాగం కార్యదర్శిగా రావెల విజయవర్ధన్, పశ్చిమ నియోజకవర్గ ఎస్టీ విభాగం అధ్యక్షుడిగా ధనావత్ వెంకటేశ్వర్లు నాయక్, 24వ డివిజన్ అధ్యక్షుడిగా మొహమ్మద్ యూనస్ పాషా, 31వ డివిజన్ అధ్యక్షుడిగా తోటా వెంకటేష్ బాబు, 43వ డివిజన్ అధ్యక్షుడిగా మారంరెడ్డి భాస్కర్‌రెడ్డి, 35వ డివిజన్ అధ్యక్షుడిగా తాడికొండ లీలావెంకట వీరాంజనేయులును నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.


