గుంటూరు రైల్వే స్టేషన్‌లో హై అలర్ట్
లక్ష్మీపురం: ఢిల్లీ బాంబు పేలుడు ఘటనతో గుంటూరు రైల్వేస్టేషన్‌లో రైల్వే పోలీసులు హై అలర్ట్ అయ్యారు. జీఆర్పీ సీఐ అంజిబాబు, ఆర్పీఎఫ్ సీఐ వీరబాబు, ఎస్‌ఐలు, సిబ్బంది డాగ్ స్క్వాడ్స్‌తో కలిసి స్టేషన్‌లో సోమవారం రాత్రి పార్కింగ్ ప్రదేశాల్లో వాహనాలు, సామగ్రితో పాటు ప్రయాణికులను తనిఖీ చేశారు. ప్రతి బోగీని పరిశీలించారు. రైల్వే స్టేషన్ తూర్పు, పశ్చిమ వైపు తనీఖీలతో పాటు గస్తీ కూడా ఏర్పాటు చేసినట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు.
పోలీసుల తనిఖీలు
జిల్లావ్యాప్తంగా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు సోమవారం అర్ధరాత్రి పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు. ప్రధాన రహదారులు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, వాణిజ్య సముదాయాలు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టాలని సూచించారు. నగరం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్‌బీఐ బ్యాంక్ కూడలి వద్ద జిల్లా ఎస్పీ స్వయంగా వాహన తనిఖీలు చేశారు.
గుంటూరు రైల్వే స్టేషన్‌లో హై అలర్ట్


