లోకేష్ జేబులు నింపేందుకే ప్రైవేటీకరణ
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు
● జిల్లా కోర్టు వద్ద లీగల్ విభాగం ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ
కోటి సంతకాల సేకరణలో అంబటి, నూరిఫాతిమా, పోలూరి వెంకటరెడ్డి
కోటి సంతకాల సేకరణలో అంబటి మురళీకృష్ణ
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్) : పేదల కడుపులు కొట్టి కుమారుడు లోకేష్ జేబులు నింపేందుకే మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ చేసేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు విమర్శించారు. వైఎస్సార్ సీపీ లీగల్ విభాగం జిల్లా అధ్యక్షుడు సీడీ భగవాన్, నగర అధ్యక్షుడు కొమ్మారెడ్డి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కోర్టు ప్రధాన ద్వారం వద్ద మెడికల్ కాలేజీల ప్రైవేటీకణను వ్యతిరేస్తూ సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది.
అంబటి రాంబాబు మాట్లాడుతూ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజల పక్షాన వైఎస్సార్ సీపీ ఉద్యమానికి శ్రీకారం చుట్టిందన్నారు. దానిలో భాగంగా కోటి సంతకాలను సేకరించి, గవర్నర్‌కు అందజేయటం ద్వారా చంద్రబాబు సర్కార్‌కు ఒక హెచ్చరిక జారీ చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 12వ తేదీన నియోజకవర్గ కేంద్రాల్లో జరగనున్న ప్రజా ఉద్యమ ర్యాలీని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
పార్టీ నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమా మాట్లాడుతూ పేద విద్యార్థులకు వైద్య విద్య, పేదలకు ఉచిత వైద్యం దూరం చేసిచేందుకు చంద్రబాబు కుయుక్తులు పన్నుతున్నారని మండి పడ్డారు.
పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ చంద్రబాబుది తొలి నుంచి స్వార్థ పూరిత విధానాలనేనని మండిపడ్డారు. పేదల సంక్షేమం, ఆరోగ్యంపై కనీస ఆలోచన లేని వ్యక్తి అని విమర్శించారు. కార్యక్రమంలో ౖలీగల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలూరి వెంకటరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, లీగల్ విభాగం నేతలు షేక్ షన్ను, వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి, కాసు వెంకటరెడ్డి, మంజుల, కళ్లం రమణారెడ్డి, రాజశేఖరెడ్డి, సుదర్శనం క్రాంతికుమార్, శ్యామల, బి. కోటేశ్వరరావు, పి. బాబూరావు, రామాంజనేయులు, చంద్రశేఖర్‌రెడ్డి, మండే సురేష్, యువజన విభాగం నగర అధ్యక్షుడు యేటి కోటేశ్వరరావు పాల్గొన్నారు.
లోకేష్ జేబులు నింపేందుకే ప్రైవేటీకరణ


