ఆర్మీ మేజర్‌కు ఘన నివాళి | - | Sakshi
Sakshi News home page

ఆర్మీ మేజర్‌కు ఘన నివాళి

Oct 16 2025 5:47 AM | Updated on Oct 16 2025 5:47 AM

ఆర్మీ మేజర్‌కు ఘన నివాళి

ఆర్మీ మేజర్‌కు ఘన నివాళి

ఆర్మీ మేజర్‌కు ఘన నివాళి లక్ష్మీపురం/పట్నంబజారు: రాజస్థాన్‌లోని సైనిక స్థావరంలో యుద్ధ విన్యాసాలు చేస్తూ గుంటూరు సంగడిగుంటకు చెందిన మేజర్‌ తేజ్‌ భరద్వాజ్‌ కన్నుమూశారు. బుధవారం ఆయన అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరిగాయి. అంతకుముందు భరద్వాజ్‌ భౌతికకాయానికి జిల్లా కలెక్టర్‌ ఎ. తమీమ్‌ అన్సారియా ఘన నివాళులు అర్పించారు. జవాన్‌లతో కలిసి గౌరవ వందనం చేశారు. జిల్లా ఎస్పీ వకుల్‌జిందాల్‌, కమిషనర్‌ పులి శ్రీనివాసులు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్‌ నూరిఫాతిమా, ఎమ్మెల్యేలు నసీర్‌ అహ్మద్‌, గళ్ళా మాధవి తదితరులు పాల్గొన్నారు. రేపు విద్యుత్‌ కార్మికుల నిరసన లక్ష్మీపురం(గుంటూరు వె్‌స్ట్‌) : ఈ నెల 15న జరగాల్సిన సమ్మె వాయిదా పడిన కారణంగా 17న మధ్యాహ్నం 3 గంటల నుంచి విద్యుత్‌ సౌధలో పవర్‌ జేఏసీతో చర్చలు జరుగుతాయని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, కానీ గడువుపై స్పష్టత లేదని ఏపీ విద్యుత్‌ ట్రేడ్‌ యూనియనన్‌ స్ట్రగుల్‌ కమిటీ జిల్లా చైర్మన్‌ దాసరి వెంకటేశ్వరరావు, వైస్‌ చైర్మన్‌ జి నాగరాజు, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బి. లక్ష్మణరావులు బుధవారం పేర్కొన్నారు. కమిటీ అభిప్రాయాన్ని చెబుతూ మొత్తం ఉద్యమంలో కీలకమైన కాంట్రాక్ట్‌ కార్మికులను సంస్థలో విలీనం చేయాలనే అంశంపై యాజమాన్యం చేతులెత్తేసిందన్నారు. జేఎల్‌ఎం –2లకు న్యాయం చేయాలన్నారు. 17న మధ్యాహ్నం 2 గంటలకు ఆయా ఇంజినీర్ల కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పత్తి కొనుగోలు నిబంధనలను సడలించాలి

లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్‌): డాక్టర్‌ స్వామినాథన్‌ సిఫారసుల ప్రకారం క్వింటా పత్తికి రూ.10,073 ధర నిర్ణయించి కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య, గుంటూరు జిల్లా కౌలు రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి పి.వి. జగనాదం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గుంటూరు కొత్తపేటలోని సీపీఐ జిల్లా కార్యాలయంలోని మల్లయ్య లింగంభవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పత్తి కొనుగోలులో వ్యాపారస్తులు సిండికేట్‌గా మారి కేంద్రం ప్రకటించిన మద్దతు ధర కూడా దక్కనివ్వడం లేదన్నారు. క్వింటా పత్తిని రూ.5 వేలలోపునకు కొనుగోలు చేసి రైతుల శ్రమను దోచుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని కనీస మద్దతు ధర రూ.7,710 ప్రకారమైనా కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

తండ్రి మందలించాడని..

ఇంటి నుంచి వెళ్లిపోయిన కొడుకు

కారంచేడు: తండ్రి మందలించినందుకు కొడుకు అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. బంధువులు, స్నేహితుల వద్ద విచారించినా కనపడకపోవడంతో పోలీసులకు బుధవారం తండ్రి ఫిర్యాదు చేశాడు. కారంచేడు ఎస్‌ఐ షేక్‌ ఖాదర్‌బాషా తెలిపిన వివరాలు.. మండలంలోని తిమిడెదపాడు గ్రామానికి చెందిన తమ్మల ప్రసాద్‌కు ముగ్గురు సంతానం కాగా ఇద్దరికి వివాహాలు చేశాడు. మూడో కుమారుడైన జయప్రకాశ్‌ ఈనెల 14వ తేదీ ఉదయం 10 గంటల నుంచి కనిపించకుండా పోయాడు. ఐటీఐ పూర్తి చేసిన జయప్రకాశ్‌ కొన్ని రోజులు హైదరాబాద్‌లో ఉండి ఉద్యోగం చేశాడు. తనకు బెంగగా ఉందని ఇంటికి రమ్మని తండ్రి కోరడంతో తిరిగి ఇంటికి వచ్చాడు. అయితే వచ్చిన దగ్గర నుంచి ఏ పనికీ వెళ్లకుండా ఇంటి వద్దనే ఉండటంతో తండ్రి మందలించి పనులు చేసుకోవాలని సూచించాడు. దీంతో అతను అలిగి పారిపోయాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement