
రాష్ట్రపతి పదవికి వన్నె తెచ్చిన కలాం
కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): దేశంలో అత్యున్నతమైన రాష్ట్రపతి పదవికి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వన్నె తెచ్చారని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా కొనియాడారు. కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో బుధవారం కలాం జయంతిని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, డీఆర్వో ఎన్‌ఎస్‌కే ఖాజావలి, సిబ్బంది ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ‘మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా కీర్తి గడించిన మహనీయులు ఏపీజే అబ్దుల్ కలాం అన్నారు. సామాన్య కుటుంబం నుంచి దేశం గర్వించదగిన శాస్త్రవేత్తగా ఎదిగిన అబ్దుల్ కలాం తన ప్రసంగాలతో యువతలో స్ఫూర్తి నింపారని పేర్కొన్నారు. ఆయన జయంతిని ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా జరుపుకోవడం మనందరికీ గర్వకారణమని తెలిపారు. ఎందరికో ఆదర్శంగా నిలిచిన అబ్దుల్ కలాం సేవలను, ఆశయాలను స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో పూర్ణచంద్రరావు,సెక్షన్ సూపరింటెండెంట్లు మల్లేశ్వరి, కల్యాణి , కలెక్టరేట్ బ్బంది పాల్గొన్నారు.
బాపట్ల: రైతు బజార్‌లో రైతులు పంటలు విక్రయించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్‌శాఖ ఏడీ కారుమూరి రమేష్‌బాబు ఆదేశించారు. స్థానిక రైతు బజార్‌ని బుధవారం తనిఖీ చేశారు. మౌలిక వసతులను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. ఆయన వెంట రైతు బజార్ ఎస్టేట్ అధికారి ఘట్రాజు ఫణీంద్ర ఉన్నారు.

రాష్ట్రపతి పదవికి వన్నె తెచ్చిన కలాం