ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్‌ వేటు | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్‌ వేటు

Oct 16 2025 5:47 AM | Updated on Oct 16 2025 5:47 AM

ఉపాధ్

ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్‌ వేటు

ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్‌ వేటు రెండు క్రస్ట్‌ గేట్లు ద్వారా నీటి విడుదల నివాసాల మధ్య కొండచిలువ బాపట్ల జేసీగా భావన వశిష్ట బాధ్యతల స్వీకారం

సత్తెనపల్లి: పల్నాడు జిల్లా పణిదం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న ఎం. జరాడ్‌బాబుపై సస్పెన్షన్‌ వేటు పడింది. పాఠశాలలో పదో తరగతి విద్యార్థినితో ఈ నెల 13న అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆమె జరిగిన సంఘటనను తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో మర్నాడు తల్లిదండ్రులు, బంధువులు, గ్రామ పెద్దలు, మహిళలు ఉపాధ్యాయుడిని నిలదీశారు. ఈ క్రమంలో కొందరు మహిళలు దేహశుద్ధి కూడా చేశారు. దీనిపై విద్యాశాఖ అధికారులు పంపిన ప్రాథమిక నివేదిక ఆధారంగా జరాడ్‌ బాబును సస్పెండ్‌ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారిణి ఎల్‌. చంద్రకళ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

విజయపురిసౌత్‌: నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద కొనసాగుతుండటంతో రెండు క్రస్ట్‌గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్‌కు 67,030 క్యూసెక్కులు వచ్చి చేరటంతో ఇక్కడి నుంచి అంతే మొత్తంలో అధికారులు దిగువకు వదులుతున్నారు. అందులో కుడి కాలువకు 10,040, ఎడమ కాలువకు 6,401, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రానికి 33,251, ఎస్‌ఎల్‌బీసీకి 1,200 క్యూసెక్కుల వరద చేరుతోంది. ప్రస్త్తుం సాగర్‌ జలాశయంలో 311.1486 టీఎంసీలు నిల్వ ఉంది.

భయంతో చంపేసిన స్థానికులు

తాడేపల్లి రూరల్‌: మండలంలోని ఉండవల్లి సెంటర్‌ హిందూ శ్మశానవాటిక దగ్గరున్న నివాసాల మధ్యలో బుధవారం ఏడు అడుగుల పొడవున్న కొండచిలువ హల్‌చల్‌ చేసింది. తెల్లవారుజామున ఇళ్లల్లోకి దూరి, కోళ్లు తినే ప్రయత్నం చేసింది. గమనించిన స్థానికులు పెద్ద పెద్ద కేకలు వేయడంతో కోళ్ల గంప నుంచి బయటకు వచ్చింది. రోడ్డుకు ఇరువైపులా తిరుగుతూ స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. దీంతో స్థానికులు భయంతో దాన్ని చంపేశారు. పీడబ్ల్యూడీ వర్క్‌షాపులో ఉన్న సామగ్రి తొలగించడంతో అక్కడి నుంచి కొండచిలువ వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇంకా ఇలాంటి విష సర్పాలు ఎన్ని వస్తాయోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బాపట్ల: జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ భావన వశిష్ట బుధవారం బాధ్యతలు చేపట్టారు. 2019 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఈమె కాకినాడ మున్సిపల్‌ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తూ బదిలీపై ఇక్కడకు వచ్చారు. గతంలో కృష్ణా జిల్లాలో ఏసీయూటీ, పార్వతీపురంలో సబ్‌ కలెక్టర్‌, జీఎస్‌ఎస్‌డబ్ల్యూఎస్‌ రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌, ఆ జిల్లాలో సంయుక్త కలెక్టర్‌ పని చేశారు. జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్ఛం అందజేశారు. తొలుత ఆమెకు డీఆర్‌ఓ గంగాధర్‌ గౌడ్‌, జిల్లా కలెక్టరేట్‌ ఏఓ మల్లికార్జునరావు ఘన స్వాగతం పలికారు. ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలన్నీ జిల్లాలోని పేద ప్రజలకు అందేలా చూస్తామన్నారు. ఆమెను అభినందించిన వారిలో బాపట్ల, చీరాల, రేపల్లె ఆర్డీఓలు పి.గ్లోరియా, చంద్రశేఖర్‌ నాయుడు, ఎన్‌.రామలక్ష్మి, బాపట్ల తహసీల్దార్‌ సలీమా షేక్‌ ఉన్నారు.

ఉపాధ్యాయుడిపై   సస్పెన్షన్‌ వేటు  1
1/2

ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్‌ వేటు

ఉపాధ్యాయుడిపై   సస్పెన్షన్‌ వేటు  2
2/2

ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్‌ వేటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement