
జిల్లా స్థాయి పోటీలకు గురుకుల విద్యార్థులు
వేటపాలెం: స్థానిక మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయి ఆటల పోటీలకు ఎంపికైనట్లు హెచ్‌ఎ ఎం.నహిద గురువారం తెలిపారు. ఇంకొల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల్లో నిర్వహించిన డివిజన్ స్థాయి ఆటల పోటీల్లో తమ విద్యార్థులు ప్రతిభ చాటారన్నారు. అండర్– 17 విభాగంలో 100 మీటర్లు, 400 మీటర్లు పరుగు పందెంలో కాటం రాజు, 200 మీటర్లలో కిశోర్, కబడ్డీలో కాటంరాజు, చెస్‌లో గోపీకృష్ణ, వాలీబాల్‌లో కిశోర్, 3 కి.మీ., 5 కి.మీ. పరుగు పందెంలో గహత్, శ్రీను ప్రతిభ చాటారన్నారు. అండర్ –14 విభాగంలో 200 మీటర్లు, 400 మీటర్లు, వాలీబాల్‌లో వినయ్‌కుమార్, 400 మీటర్లలో సతీష్‌కుమార్, చెస్‌లో దేవరాజు, ఖోఖోలో చందు ప్రతిభ చూపారని పేర్కొన్నారు. జిల్లా స్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు తెలిపారు. విద్యార్థులను పీఈటీ కె. మమత, ఉపాధ్యాయులు అభినందించారు.