లలిత సంగీత సరస్వతి | - | Sakshi
Sakshi News home page

లలిత సంగీత సరస్వతి

Oct 16 2025 5:47 AM | Updated on Oct 16 2025 5:47 AM

లలిత

లలిత సంగీత సరస్వతి

లలిత సంగీత సరస్వతి

అలా బీజం పడింది...

తెనాలి: బాలసరస్వతి స్వస్థలం ఉమ్మడి తెనాలి డివిజనులోని బాపట్ల. 1928 ఆగస్టు 28న జన్మించారు. తల్లిదండ్రులు విశాలాక్షి, పార్థసారథిరావు. లలిత కళలపై అభిమానం కలిగిన తండ్రి సితార, వీణ వాయించేవారు. గుంటూరులో రత్నా థియేటర్‌ పేరుతో సినిమాహాలు నిర్మించారు. థియేటరులో ప్రదర్శించే ఏదైనా సినిమాలో సంగీతానికి తగినంత ప్రాధాన్యం లేదని అనిపిస్తే, వెంటనే ఆ సినిమా ప్రదర్శన నిలిపివేసి, అందుబాటులో ఉన్న నాటక సమాజాన్ని పిలిపించి, పద్యనాటకం వేయించారు. అంతటి సంగీతాభిమాని ఆయన. కాలక్రమంలో వ్యాపారం దెబ్బతిని, థియేటర్‌ మూతపడింది. తండ్రి వారసత్వం అన్నట్టుగా బాలసరస్వతికి సంగీతంపై ఆసక్తి ఏర్పడింది. అక్క, అన్నయ్య చక్కగా చదువుకుంటున్నా తండ్రితోపాటు నాటకాలు చూడటం, వాటిలోని పాటలు గానం చేయటం అలవాటైంది. అప్పట్లో గుంటూరులో హెచ్‌ఎంవీ (హిజ్‌ మాస్టర్స్‌ వాయిస్‌) గ్రామఫోను కంపెనీ ఆఫీసుండేది. పార్థసారిథిరావుకు పరిచయస్తులు. ఓసారి బాలసరస్వతిని పిలిపించి, ట్రైనింగ్‌లా పాడమన్నారు. బాగుండటంతో బెంగళూరులో రికార్డు చేశారు. ఆ విధంగా 1934లో ఆరేళ్ల వయసులో సోలో రికార్డు పాడిన ఘనతను బాలసరస్వతి దక్కించుకున్నారు. మైకు అందేంత ఎత్తు లేకపోవటతో సినీనటుడు సత్యం సోదరుడు కామేశ్వరరావు ఎత్తుకోగా, ఆమె ఆ పాట పాడారు.

శ్రోతలను ఆకట్టుకునేలా..

అంతకుముందు 1941లో రేణుకావారి ‘భాగ్యలక్ష్మి’ సినిమాలో బీఎన్‌ఆర్‌ సంగీత దర్శకత్వంలో పాడిన ‘తిన్నెమీద చిన్నోడా’ పాట బాలసరస్వతి తొలి ప్లేబాక్‌ పాట. సుతిమెత్తగా, చక్కని భావప్రకటనతో, ప్రత్యేకమైన పాడే విధానంతో శ్రోతలను ఆకట్టుకుని మనసు లోతుల్లోకి ప్రవహించే అమృతధారగా పాటను మార్చుకున్న ప్రతిభాశాలి బాలసరస్వతి. ‘స్వప్నసుందరి’లో కథానాయిక కోసం పాడినా, ‘దేవదాసు’లో ద్వితీయ నాయికకు గానం చేసినా ఆమె తనకు తానే సాటిగా నిలిచారు. సినిమాలకు పాడుతూనే ఎస్‌.రాజేశ్వరరావు, బాలసరస్వతి కలిసి‘ లలిత సంగీతం’ పేరిట, తెలుగు సంగీత ప్రపంచంలో కొత్త విభాగాన్ని ఆవిష్కరించారు. ఆకాశవాణిలో వీరిద్దరూ పాడే లలిత గీతాలు లక్షల సంఖ్యలో అభిమానులను సంపాదించారు. 1946లో సింహళ చిత్రం ‘లైలా మజ్నూ’కు సంగీతం సమకూర్చారు. తాను సోలోగా పాడిన ప్రైవేటు గీతాలకు స్వయంగా సంగీతబద్దం చేసుకుంటూ వచ్చారు. 1974లో భర్త మరణం, దివాణాలు, వైభవాలు అంతరించటంతో చైన్నె, తర్వాత మైసూరు, బెంగళూరులో ఉంటూ 1995లో హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. భూములు పోయినా నష్టపరిహారం అందలేదు. మైసూరు నుంచి హైదరాబాద్‌ వస్తే సాంస్కృతిక శాఖలో ఉద్యోగం ఇస్తామన్న ఎన్టీ రామారావు ఆహ్వానంపై ఇక్కడికి వచ్చేసరికి రాకీయాలు మారిపోయాయి. 2015లో గుంటూరులో బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్‌ బాలసరస్వతిని విశిష్ట సేవా పురస్కారంతో సత్కరించి రూ.లక్ష నగదు, రజత జ్ఞాపికను బహూకరించారు. ఈ సందర్భంగా ‘నిండుపున్నమి పండువెన్నెల’ పేరుతో అభినందన సంచికను విడుదల చేశారు.

తొలి అడుగులు గుంటూరులోనే..

బాలగాయనిగా ఇక్కడి

నుంచే సినీప్రస్థానం

గతంలో విశిష్ట సేవా

పురస్కారంతో సత్కారం

ఆ సమయంలో అక్కడే ఉన్న సుప్రసిద్ధ దర్శకుడు సి.పుల్లయ్య, తన ‘సతీఅనసూయ–భక్త ధృవ’ సినిమాలో బాలనటిగా తీసుకున్నారు. అందులో గంగ పాత్రలో నటిస్తూ బాలసరస్వతి పాడిన పాట ‘ఏదీ దారి నాకిచట’ ఆ రోజుల్లో పెద్ద హిట్‌. కోల్‌కతాలో ఈ షూటింగ్‌ జరుగుతుండగా, అక్కడే చిత్రీకరిస్తున్న తమిళ చిత్రం ‘భక్తకుచేల’లో రెండు పాత్రలు ఇచ్చారు. మొదటి భాగంలో చిన్న కృష్ణుడు, రెండో భాగంలో కుచేలుని కూతురు పాత్రలో పోషించారు. అందులో పాటలు కూడా తానే పాడారు. తర్వాత ‘బాలయోగిని’ తమిళ సినిమాలో టైటిల్‌ రోల్‌ తనదే. అప్పటివరకు సరస్వతిగా ఉన్న ఆమె పేరుకు ముందు ‘బాల’ అని అప్పుడే కలిపారు. తన సినిమాల్లోని పాటలు, బయట కచేరీల్లో పాడుతూ బహుమతులను అందుకుంటూ వచ్చారు. బాలయోగిని సినిమా తర్వాత చైన్నెలో సెటిలయ్యారు. బాలనటిగా ‘తుకారం’ (1937), ‘మహానంద’, ‘తిరునీలంకర్‌’ (1939) సినిమాల్లో నటించాక, 1940లో ఇందిరా వారి ‘ఇల్లాలు’ సినిమాలో సంగీత దర్శకుడు ఎస్‌.రాజేశ్వరరావుతో కలిసి నటించారు. వరుసగా సినిమాల్లో నటిస్తుండగానే 1944లో తూర్పుగోదావరి జిల్లా కోలంక జమీందారు రావు ప్రద్యుమ్న కృష్ణ మహీపతి సూర్యారావుతో వివాహమైంది. దీనితో నటనకు స్వస్తిపలికి, పాటలకే పరిమితమయ్యారు.

లలిత సంగీత సరస్వతి 1
1/2

లలిత సంగీత సరస్వతి

లలిత సంగీత సరస్వతి 2
2/2

లలిత సంగీత సరస్వతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement