
బాజీ బాబాకే టోకరా
న్యూస్‌రీల్
అక్రమాలను అరికట్టాలి
సాగర్‌లో క్రస్ట్ గేట్లు మూత
పులిచింతల ప్రాజెక్టు సమాచారం
గుంటూరు
● ప్రణాళిక, వ్యవసాయ శాఖ
ఆధ్వర్యంలో సేకరణ
● ఐదు పంటల్లో 140 ప్రయోగాలు
సూపర్ జీఎస్టీపై 19 వరకు ఎగ్జిబిషన్ కమ్ సేల్
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్) : సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ గుంటూరు జిల్లా ఉత్సవ్‌ను కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా, డెప్యూటీ మేయర్ షేక్ సజీలతో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ నెల 19వ తేదీ వరకు ఉత్సవ్ జరుగుతుందని ఆమె తెలిపారు. అనంతరం మాట్లాడుతూ ధరలు తగ్గలేదని ఫిర్యాదులు రాకూడదని వ్యాపారులకు సూచించారు. ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నగర పాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ జీఎస్టీ 2.0పై ప్రజలు పూర్తిస్థాయిలో అవగాహన పొందాలని, తద్వారా ప్రశ్నించే అవకాశం ఉంటుందని తెలిపారు.జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ జీఎస్టీలో వచ్చిన పొదుపును గృహ అవసరాలకు ఖర్చు చేయాలని సూచించారు. జీఎస్టీ జాయింట్ కమిషనర్ బి. గీతా మాధురి మాట్లాడుతూ ప్రతి వస్తువుపై జీఎస్టీ ధరల తగ్గుదలను ప్రతి ఒక్కరూ గమనించాలని తెలిపారు.
ఏసీ కళాశాల ఆవరణలో ఏర్పాట్లు
జీఎస్టీ 2.0పై వినియోగదారులకు పూర్తి అవగాహన కల్పించేందుకు ఏసీ కళాశాల ఆడిటోరియం హాలులో ఉత్సవ్‌ను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా లోగో కూడా తయారు చేయించారు. ప్రతి రోజూ రాత్రి 9 గంటల వరకు ఎగ్జిబిషన్‌లో అమ్మకాలు జరుగుతాయి. పచ్చళ్లు, పొడులు, గృహోపకరణాలు, క్రీడా పరికరాలు, జిమ్, ఫిట్‌నెస్, సోలార్, బుక్స్ స్టేషనరీ, వ్యవసాయ పరికరాలు, పురుగు మందులు, అన్ని రకాల ఎలక్ట్రానిక్స్ వస్తువులు, వాహనాలు, ట్రాక్టర్లతో 70 స్టాల్స్ ఏర్పాటు చేశారు.
రైతులకు విస్తృతంగా
అవగాహన కల్పించాలి
జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన, పాడి పరిశ్రమ రంగాల్లో పెట్టుబడి వ్యయం తగ్గించి దిగుబడులు ద్వారా అధిక ఆదాయం సాధించేందుకు అవలంబించాల్సిన పద్ధతులపై రైతులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా తెలిపారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో గురువారం సాయంత్రం ఆమె పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన పంటల సాగు వివరాలు, దిగుబడి, సాగు ప్రోత్సాహానికి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, రాయితీల వివరాలు, పంటల వారీగా సాగు పెట్టుబడి, దిగుబడి వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆమె వివరించారు.
పెదకాకాని: బాజీ బాబా దర్గాలో కూటమి నాయకుల దందాలు, ఆక్రమణలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వక్ఫ్‌బోర్డు అధికారులతో కుమ్మకై ్క బాబా వారికి భక్తులు సమర్పించిన కానుకలు పెద్ద మొత్తంలో కాజేస్తున్నారు. వక్ఫ్ బోర్డు మేనేజ్‌మెంట్‌లో కొనసాగుతున్న హజరత్ సయ్యద్ బాజీ షహీద్ అవులియా దర్గాకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో పేరు ఉంది. భక్తులు వచ్చి ప్రార్థనలను చేసుకోవడం, మొక్కులు చెల్లించుకోవడం దశాబ్దాలుగా ఇక్కడ జరుగుతోంది. పలువురు భక్తులు బాబావారిపై ఉన్న భక్తితో శక్తికొలది దర్గా అభివృద్ధికి కానుకలు నగదు రూపంలో చెల్లిస్తుంటారు. మరి కొందరు దర్గాకు వచ్చే భక్తుల సౌకర్యార్థం షెడ్లు నిర్మించారు.
గతంలో దర్గాకు వచ్చిన భక్తులు మొక్కులు చెల్లించుకోవడంలో భాగంగా వంట అక్కడే చేసుకునేవారు. వర్షా కాలం భోజనం తినే సమయానికి వాన వచ్చి అనేక ఇబ్బందులు పడిన సందర్భాలు కొల్లలు. దీంతో దాతలు దర్గాలో మొక్కులు చెల్లించుకునే వారి సౌకర్యార్థం షెడ్డును నిర్మించారు. దీన్ని కూటమి నాయకులు ఆక్రమించుకుని అందులో టెంట్‌హౌస్ వ్యాపారం నిర్వహిస్తున్నారు.
బాబాపై ఉన్న భక్తితో షెడ్డు నిర్మించానని, అందులో టెంటు సామాను ఖాళీ చేయించి భక్తులకు ఉపయోగపడేలా చూడాలని దాత కోరినప్పటికీ వక్ఫ్‌బోర్డు అధికారులు పట్టించుకోవడం లేదు. భక్తులు దర్గాకు వస్తూ టెంటు, సామాన్లు తెచ్చుకున్నా అడ్డుకుంటున్నారు. తమ దగ్గరే తీసుకోవాలంటూ హుకుం జారీ చేస్తున్నారు.
యడ్లపాడు: సంక్రాంతి పర్వదినం నాడు జిల్లాలోని పర్యాటక కేంద్రాలైన కోటప్పకొండ, కొండవీడు ప్రాంతాల్లో టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఫెస్టివల్ నిర్వహించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కృతికా శుక్లా చెప్పారు. ఇప్పటికే అటవీశాఖ, టూరిజం శాఖల అధికారులు దీనిపై రూపకల్పన చేశారన్నారు. కొండవీడుకోటను కలెక్టర్ కృతికా శుక్లా పలుశాఖల జిల్లా స్థాయి అధికారులతో కలసి గురువారం సందర్శించారు. కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లా పరిధిలోని అన్ని పర్యాటక కేంద్రాలను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. తొలుత ఘాట్ రోడ్డు ప్రారంభంలోని చెక్‌పోస్టు వద్దకు రాగానే కలెక్టర్‌కు డీఎఫ్‌వో జి కృష్ణప్రియ స్వాగతం పలికారు. రిజర్వ్ ఫారెస్టు భూముల వివరాలను కలెక్టర్‌కు వివరించారు.
మొదలైన పంట కోత ప్రయోగాలు
I
పెదకాకాని బాజీ బాబా దర్గాలో
దోపిడీల పర్వం
యథేచ్ఛగా కూటమి నాయకుల దందా
అధికారులతో కుమ్మక్కు
కానుకల లెక్కింపులో చేతివాటం
అక్రమాలను అరికట్టాలని ముస్లిం
హక్కుల పోరాట సమితి డిమాండ్
వక్ఫ్ బోర్డు అధికారులు, ప్రజా ప్రతినిధులు వెంటనే స్పందించి అక్రమాలను అరికట్టాలి. టెంట్ హౌస్‌ను వెంటనే తొలగించాలి. హుండీల కానుకలు లెక్కింపులో సమయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. వారికి అనుకూలమైన ఫోటోగ్రాఫర్‌ను పెట్టుకుని కూటమి నాయకులు, వక్ఫ్‌బోర్డు అధికారులు కుమ్మకై ్క బాబా వారికి భక్తులు సమర్పించిన కానుకలు పెద్ద మొత్తంలో కాజేస్తున్నారు.
– షేక్ ఖాజావలి, ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద నీరు తగ్గడంతో గురువారం క్రస్ట్ గేట్లు మూసివేశారు. ప్రస్తుతం నీటిమట్టం 589.30 అడుగులు.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 53,355 క్యూసెక్కులు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు నుంచి దిగువకు 53,355 క్యూసెక్కులు వదులుతున్నారు.
దర్గాలో మూడు నెలలకు ఒకసారి హుండీలు తెరచి కానుకలు లెక్కింపు చేస్తూ ఉంటారు. ఈ సమయంలో చిల్లర నాణేలు సుమారు రూ. 2 లక్షల వరకూ వస్తుంటాయి. స్థానిక కూటమి నాయకుడి ఒత్తిడితో లెక్కించకుండానే రూ. 30 వేల నుంచి రూ. 40 వేలు తీసుకుని అతనికి అప్పగిస్తున్నారు. హుండీల్లోని కానుకలు లెక్కింపు సమయంలో కూడా కూటమి వారికి అనుకూలమైన ఫోటో వీడియోగ్రాఫర్‌ను ఏర్పాటు చేసుకుని హుండీల్లోని నగదు కాజేస్తున్నారని భక్తుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వక్ఫ్‌బోర్డు అధికారులు, స్థానిక ఈఓ, కూటమి నాయకులు కుమ్మకై ్క ఫోటోలకు, వీడియోకు దొరక్కుండా నగదు కాజేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. వక్ఫ్ బోర్డులో పనిచేస్తున్న కొందరు అవినీతి అధికారులు కూడా అక్రమాలను ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు, వక్ఫ్‌బోర్డు అధికారులు, చైర్మన్ స్పందించి అక్రమాలను అరికట్టాలని భక్తులు, పెదకాకాన్ని ప్రజలు కోరుతున్నారు.
పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా

బాజీ బాబాకే టోకరా

బాజీ బాబాకే టోకరా

బాజీ బాబాకే టోకరా

బాజీ బాబాకే టోకరా

బాజీ బాబాకే టోకరా

బాజీ బాబాకే టోకరా

బాజీ బాబాకే టోకరా

బాజీ బాబాకే టోకరా

బాజీ బాబాకే టోకరా