విద్యార్థిని చితకబాదిన వైస్‌ ప్రిన్సిపాల్‌ | - | Sakshi
Sakshi News home page

విద్యార్థిని చితకబాదిన వైస్‌ ప్రిన్సిపాల్‌

Oct 9 2025 10:03 AM | Updated on Oct 9 2025 10:21 AM

Vice principal beat student hand got swell

వైస్‌ ప్రిన్సిపాల్‌ కొట్టడంతో వాచిన చేయి

చెరుకుపల్లి: బాపట్ల జిల్లా గుళ్లపల్లి ఎన్‌ఆర్‌ఐ కళాళాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సర విద్యార్థి పాల్‌ గాంధీని వైస్‌ ప్రిన్సిపాల్‌ విచక్షణ రహితంగా కొట్టగా ఆస్పత్రి పాలైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థి తల్లిదండ్రుల వివరాల మేరకు... గుళ్లపల్లి శివాలయం కాలనీకి చెందిన విద్యార్థి చల్లా పాల్‌ గాంధీకి, యశ్వంత్‌ అనే విద్యార్థితో ఈ నెల 7న క్లాస్‌రూమ్‌ బెంచ్‌పై కూర్చునే విషయంలో ఘర్షణ జరిగింది. 

ఈ క్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ విజయ్‌ తరగతి గదికి వచ్చి విద్యార్థులను అడగ్గా పాల్‌గాంధీ యశ్వంత్‌ను కొట్టాడని చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన వైస్‌ ప్రిన్సిపల్‌ పాల్‌గాంధీపై తన మోచేతితో వీపుమీద గుద్దుతుండగా దెబ్బలు తట్టుకోలేక చెయ్యి అడ్డం పెట్టాడు. చేతి వేళ్లు విరగడంతో తొలుత రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ స్కానింగ్‌, ఎక్సరే తీయగా కుడి చేతి వేలి ఎముక విరిగినట్టు తల్లిదండ్రులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement