బొక్కేస్తున్న పచ్చ బ్యాచ్‌! | - | Sakshi
Sakshi News home page

బొక్కేస్తున్న పచ్చ బ్యాచ్‌!

Oct 5 2025 5:01 AM | Updated on Oct 5 2025 5:01 AM

బొక్క

బొక్కేస్తున్న పచ్చ బ్యాచ్‌!

ఆదివారం శ్రీ 5 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025 బొక్కేస్తున్న పచ్చ బ్యాచ్‌!

న్యూస్‌రీల్‌

గుంటూరు జిల్లాలో

రెచ్చిపోతున్న రేషన్‌ మాఫియా

బాపట్ల జిల్లాలో

దాడులు లేవు...!

పల్నాడు జిల్లాలో

ఆదివారం శ్రీ 5 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025

సాక్షి ప్రతినిధి, గుంటూరు : ఉమ్మడి గుంటూరు జిల్లాలో రేషన్‌ బియ్యం అక్రమ రవాణా నిరాటంకంగా కొనసాగుతోంది. మాముళ్లు అందుతుండడంతో కూటమి ఎమ్మెల్యేలు కొమ్ముకాస్తున్నారు. బాపట్ల జిల్లా నుంచి తరలిపోతున్న రేషన్‌ బియ్యం ఒక్క రోజులోనే పొన్నూరు, ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడులో వెయ్యి బస్తాలు పట్టుబడిందంటే ఈ దందా స్థాయి అర్థం చేసుకోవచ్చు. మాఫియాలోని వర్గాల సమాచారంతో ఇవి పట్టుబడ్డాయని, లేకుంటే కృష్ణపట్నం పోర్టుకు తరలిపోయేవని తెలుస్తోంది.

వేమూరు నియోజకవర్గంలో వేమూరు, కొల్లూరు, భట్టిప్రోలు, అమర్తలూరు, చుండూరు మండలాల్లో ఎమ్మెల్యే అనుచరుల ఆధ్వర్యంలో దందా కొనసాగుతోంది. ప్రజల నుంచి రూ.10కే బియ్యం కొనుగోలు చేసి చుండూరు మండలం నడిగడ్డవారిపాలెం రైస్‌ మిల్లుకు తరలిస్తున్నారు. పాలీష్‌ చేసి నేరుగా కృష్ణపట్నం పోర్టుకు తీసుకెళుతున్నారు. భట్టిప్రోలు నుంచి తరలిస్తున్న బియ్యాన్ని గురువారం పొన్నూరులో 300 బస్తాలు పట్టుకున్నారు.

● రేపల్లె నియోజకవర్గంలో డీలర్లు కిలో రూ.10 చొప్పున కొని కూటమి నాయకులకు రూ. 11 నుంచి రూ.12 వరకు అమ్ముతున్నారు. తర్వాత ప్రకాశం జిల్లాకు తరలిస్తున్నారు. ఆపై రూ.16కు విక్రయిస్తున్నట్లు సమాచారం. నిజాంపట్నం మండలం కొలసానివారిపాలెంకు చెందిన కూటమి నేత కీలకంగా ఉన్నాడు. ప్రతి నెలా ఎమ్మెల్యేకు పెద్ద మొత్తం అందుతున్నట్లు తెలుస్తోంది.

● బాపట్ల నియోజకవర్గంలో టీడీపీ నాయకులు ఈనగంటి గాంధీ, వక్కలగడ్డ సుధీర్‌ రేషన్‌ ఈ వ్యాపారం చేస్తున్నారు. బాపట్ల నుంచి తరలిస్తున్న 700 బస్తాల బియ్యం శుక్రవారం నాగులుప్పలపాడులో పట్టుబడిన సంగతి తెలిసిందే.

గుంటూరులోని శ్రీనగర్‌కు చెందిన జనసేన నేత అనిల్‌ కీలకంగా వ్యవహరిస్తున్నారు. తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు ఒకరు డీలర్లతో మాట్లాడి ప్రతినెల బియ్యం కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. అధికారుల ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఆర్టీసీ కాలనీకి చెందిన నాగేశ్వరరావు మిల్లర్‌ ద్వారా బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. మోహన్‌, సుబ్బారావులు కీలకపాత్ర పోషిస్తున్నారు.

● పొన్నూరులో పచ్చ నేతలు ముగ్గురు హవా చాటుతున్నారు. పచ్చ జెండా మోసి అలసిపోయిన ఓ మువ్వగోపాలుడు మండలాన్ని చేజిక్కించుకున్నట్లు సమాచారం. రెండు నెలల క్రితం ఓ ఇంట్లో 70 బస్తాల రేషన్‌ బియ్యం నిల్వ చేసి పోలీసు రికార్డులకు ఎక్కిన టీడీపీ సానుభూతిపరుడు రబ్బాని ప్రస్తుతం కీలకంగా మారారని సమాచారం. పెదకాకాని మండలంలోని వెనిగండ్ల కేంద్రంగా అక్రమ రవాణా సాగుతోంది.

● తాడికొండ నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యే ఫిరంగిపురం మండలంలోని టీడీపీ యువ నాయకుడికి దందా అప్పగించారు. మండలాల్లో నేతలకు మామూళ్లు ఇచ్చి నడిపిస్తున్నారు. తాడికొండలో ఇద్దరు రేషన్‌ డీలర్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రత్తిపాడులో కొని రైస్‌ మిల్లులకు తరలిస్తున్నారు. ఎమ్మెల్యే అల్లుడు, అనుచరులు దందా నడిపిస్తున్నారు.

● మంత్రి లోకేష్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిలో బియ్యం నేరుగా మిల్లుల వద్దకు చేరుస్తున్నారు. పాలీష్‌ చేసి కిలో రూ. 50 నుంచి రూ.70కి విక్రయిస్తున్నారు. కూటమి నేతల అండతో ఓ టీవీ చానల్‌ రిపోర్టర్‌ సోదరుడు రేషన్‌ దుకాణాలపై పెత్తనం చేస్తున్నట్లు సమాచారం

రేషన్‌ బియ్యం అక్రమ రవాణా పూర్తిగా అధికార పార్టీ నేతల అండదండలతో సాగుతుండటంతో రెవెన్యూ, పోలీసు, విజిలెన్స్‌ శాఖల అధికారులు లంచాలు తీసుకుని చోద్యం చూస్తున్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన లారీలు, ఆటోలు మాత్రమే పట్టుబడటమే ఇందుకు నిదర్శనం.

పొన్నూరులో అధికారులకు చిక్కిన రేషన్‌ బియ్యం బస్తాలు

టీడీపీ నాయకుల కనుసన్నల్లో

రేషన్‌ మాఫియా

అక్రమంగా బియ్యాన్ని

తరలిస్తున్న డీలర్లు

అర్ధరాత్రి యథేచ్ఛగా అక్రమ రవాణా

షాడో ఎమ్మెల్యేల కనుసన్నల్లో

కార్యకలాపాలు

బియ్యం పట్టుకుంటే ఎమ్మెల్యే

అనుచరుల నుంచి ఫోన్లు

పేదల నోటి దగ్గర కూడూ

లాక్కుంటున్న నేతలు

ప్రేక్షక పాత్రకే పరిమితమైన

అధికారులు

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రేషన్‌ మాఫియా రెచ్చిపోతోంది. పొన్నూరులో మామిళ్ళపల్లి కేంద్రంగా వ్యాపారం జోరుగా సాగిస్తున్నారు. టీడీపీ నాయకులు అక్రమార్జనకు పాల్పడుతున్నారు. పాలకులు రేషన్‌ అక్రమ రవాణాను అడ్డుకోవడంలో విఫలమవుతున్నారు.

– చింతలపూడి మురళీకృష్ణ,

వైఎస్సార్‌ సీపీ పొన్నూరు మండల

అధ్యక్షుడు, గుంటూరు జిల్లా.

పల్నాడు జిల్లాలో కూడా రేషన్‌ బియ్యం అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. సత్తెనపల్లిలో షాడో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బియ్యం అక్రమంగా కొనుగోలు చేస్తున్నారు. రాత్రి వేళ బొలెరో వాహనాలలో నకరికల్లుకు తరలిస్తున్నారు. ఎమ్మెల్యే ఏమీ తెలియనట్లు నటిస్తున్నారు.

బొక్కేస్తున్న పచ్చ బ్యాచ్‌! 1
1/1

బొక్కేస్తున్న పచ్చ బ్యాచ్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement