తులసి గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ తులసి యోగీష్ చంద్ర
కొరిటెపాడు(గుంటూరు): కృష్ణదేవరాయ ఎయిడ్ ఫర్ పూర్ అండ్ అండర్ ప్రివిలేజ్డ్, ఏపీ కాట్వా సంయుక్త ఆధ్వర్యంలో చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 650 మంది పేద విద్యార్థులకు రూ.24.50 లక్షల ఉపకార వేతనాలను పంపిణీ చేయనున్నట్లు తులసి గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ తులసి యోగీష్ చంద్ర శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిభకు పట్టాభిషేకం కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, అమలాపురంలోని ముక్తేశ్వరం రోడ్‌లోని సత్యనారాయణ గార్డెన్స్‌లో ఆదివారం ఉదయం 9 గంటకు కార్యక్రమం ప్రారంభమవుతోందన్నారు. తులసి గ్రూప్స్ చైర్మన్ తులసి రామచంద్ర ప్రభు ముఖ్య అతిథిగా హాజరై ఉపకార వేతనాలు వితరణ చేయనున్నట్టు వెల్లడించారు. ఇందులో 331 మంది విద్యార్థులకు రూ.11.84 లక్షలు తులసి సీడ్స్ ఆధ్వర్యంలో కృష్ణదేవరాయ ఎయిడ్ ఫర్ పూర్ అండ్ అండర్ ప్రివిలేజ్డ్ ద్వారా పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తున్నట్లు ఆయన వివరించారు.