
గౌడ్‌గా కులధ్రువీకరణ పత్రం అందించాలి
పెదకాకాని: ప్రభుత్వం గౌడ కులస్తులందరికీ గౌడ్‌గా కుల ధ్రువీకరణ పత్రం మంజూరు చేయడంతోపాటు సంక్షేమ పథకాలకూ పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యామా మురళీగౌడ్ అన్నారు. గుంటూరు ఇన్నర్‌రింగ్ రోడ్డులో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశానికి బీజేపీ ఓబీసీ విభాగ అధ్యక్షుడు అనుమోలు ఏడుకొండలు గౌడ్ అధ్యక్షత వహించారు. మురళీగౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా గౌడ సామాజిక వర్గానికి పలు పేర్లతో కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేస్తోందన్నారు. భవిష్యత్‌లో ఇబ్బందులు పడకుండా అందరికీ గౌడ్ (బీసీ–బీ) పత్రాలు మంజూరు చేయాలన్నారు. సంఘం నాయకులు యడవల్లి కొండలు, కుక్కల రాంప్రసాద్, బెజవాడ మల్లికార్జున్, యోకరాల రాము, ఎరుకల వెంకట్రావు, యడవల్లి సైదారావు, తుళ్ళూరు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.