
అంతర్రాష్ట్ర దొంగలు అరెస్టు
లక్ష్మీపురం: చెడు వ్యసనాలకు అలవాటుపడి గంజాయి విక్రయిస్తూ, ద్విచక్ర వాహనాలు చోరీ చేసే ఎనిమిది మంది అంతర్రాష్ట్ర దొంగలను అరండల్‌పేట పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ కె.అరవింద్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం బ్రాడీపేటలో కొంత మంది గుంపుగా చేరి గంజాయి విక్రయిస్తున్నట్లు అరండల్‌పేట సీఐ ఆరోగ్య రాజుకు సమాచారం వచ్చింది. హుటాహుటిన ఆయన ఎస్‌ఐ కృష్ణబాజీ, సిబ్బందితో ఆకస్మిక దాడులు నిర్వహించగా కొంత మంది పరారయ్యారు. మిగిలిన వారిలో శ్రీనగర్‌కు చెందిన ఇంజాపల్లి మేరిబాబు, వెంగళరావునగర్‌కు చెందిన యద్దనపూడి దీనభాస్కర్, శారదా కాలనీకి చెందిన బడుగు ప్రభుకుమార్, ఒక మైనర్ బాలుడు, గోరంట్లకు చెందిన పణిదరపు అమరజ్యోతి, వెంగళరావు నగర్‌కు చెందిన ఏలూరి ఎలిజిబెత్‌రాజు, శివనాగ రాజు కాలనీకి చెందిన తూతిక అలియాస్ పాతూరి సైని, అలియాస్ హనీ, ఒరిస్సా రాష్ట్రంలోని పారిమ గ్రామానికి చెందిన పారిమ జోయామాజిలను అదుపులో తీసుకుని, కేసు నమోదు చేశారు. వీరి వద్ద గల 3.5 కేజీల గంజాయితో పాటు చోరీ చేసిన ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. వీరితో పాటు గంజాయి తాగుతున్న ఏసుబాబు, హర్ష సరిఫుద్దీన్, దుర్గాప్రసాద్, లక్ష్మణ్, అమరజ్యోతి, ఈశ్వర్, మురళి, వీరాస్వామిలు పరారీలో ఉన్నారు. వీరిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని డీఎస్పీ తెలిపారు. సీఐ ఆరోగ్య రాజు, ఎస్‌ఐలు కృష్ణబాజి, ఎం.సుబ్బారావు, హెడ్ కానిస్టేబుల్ చిరంజీవులు, కానిస్టేబుల్ డేవిడ్‌లను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు.
3.5 కేజీల గంజాయి స్వాధీనం
ఎనిమిది బైక్‌లను సీజ్ చేసిన
అరండల్‌పేట పోలీసులు