
సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు !
ఇంగ్లిష్ మీడియాన్ని కొనసాగించాలి
గుంటూరు వెస్ట్ : ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పీజీఆర్‌ఎస్ కార్యక్రమం నిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అధికారులకు సూచించారు. సోమవారం కలక్టరేట్‌లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత సమయంలో పరిష్కరించాలని తెలిపారు. అనంతరం వచ్చిన 291 అర్జీలను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డీఆర్వో ఎన్‌ఎస్‌కే ఖాజావలి, డెప్యూటీ కలెక్టర్లు లక్ష్మీ కుమారి , గంగరాజు , గుంటూరు ఆర్డీఓ కె. శ్రీనివాసరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్‌తో కలిసి పరిశీలించారు.
కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా
గుంటూరు రూరల్ మండలంలోని తురపాలెంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 30 మంది మరణించారు. ఇప్పటి వరకు ఎటువంటి నష్టనివారణతో పాటు కనీసం తమ బాధల్ని కూడా పంచుకోలేని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వెంటనే రాజీనామా చేయాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించి అమాయకులు చావులకు కారణమైన అధికారులపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయాలి. ఇవి ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే. బాధిత కుటుంబాలకు తక్షణం నష్టపరిహారం చెల్లించాలి. కూటమి ప్రభుత్వ పెద్దలు తురకపాలెంలోని ఉండి సమస్యలు పరిష్కరించాలి.
– కుల, దళిత ప్రజా సంఘాల నాయకులు
గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్ధులకు ఆంగ్ల బోధన చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా పాఠశాలల్లో తొలగించారు. పేద పిల్లలు అంతర్జాతీయ పోటీలను తట్టుకోవాలంటే ఆంగ్ల మీడియం తప్పనిసరి. తప్పకుండా ఆంగ్ల విద్యాబోధన పునఃప్రారంభించాలి.
–డి. ఏడుకొండలు షెఫర్డ్, కె.మహమ్మద్ నూర్,
ఇంగ్లిష్ విద్యా పరిరక్షణ వేదిక సభ్యులు, గుంటూరు

సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు !