
క్షేత్రస్థాయిలో పటిష్టంగా పనిచేయాలి
గుంటూరు వెస్ట్ : క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బంది పటిష్టంగా పని చేయాలని, అతిసార లక్షణాలు కనిపించిన ప్రాంతాల్లో ఆరోగ్య సర్వే రెండు రోజుల్లో పూర్తి కావాలని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఆదేశించారు. సీజనల్ వ్యాధులపై శనివారం కార్యాలయంలో ఆమె సమీక్షించారు. అనంతరం పోషకాహారంపై పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని మందులు, ఓఆర్‌ఎస్ పాకెట్స్ అందుబాటులో ఉంచాలని, అవసరమైతే తక్షణ వైద్య సేవలు అందించాలని సూచించారు. ఎక్కడైనా ప్రజల్లో అనారోగ్య లక్షణాలు కన్పిస్తే కలెక్టర్ కార్యాలయంలో గల కంట్రోల్ రూమ్ 08963– 2234014 కు తెలియజేయాలని కోరారు. కార్యక్రమంలో జేసీ అశుతోష్ శ్రీవాస్తవ, ఆర్డీఓ ఎన్.ఎస్.కె.ఖాజావలి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె. విజయలక్ష్మి, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎస్.ఎస్.వి.రమణ, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీర్ కల్యాణ చక్రవర్తి, జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగ సాయి కుమార్, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ పి. ప్రసూన, జిల్లా విద్యా శాఖ అధికారి రేణుక పాల్గొన్నారు.
జీజీహెచ్‌లో రోగులకు పరామర్శ
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్, లాంచస్టర్ రోడ్డులోని యూపీహెచ్‌సీని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులను సందర్శించి అతిసార, వైద్య చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. యూపీహెచ్‌సీ నిర్వహించిన స్వస్థ నారి– స్వశక్తి పరివార్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. గర్భిణులకు సీమంతం చేశారు.అనంతరం 19వ వార్డు సంగడిగుంటలో ఇంటింటి ఆరోగ్య సర్వే కార్యక్రమాన్ని తనిఖీ చేశారు.
కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా