
మధ్యలో నిలిచిన డ్రెయిన్ల నిర్మాణం
నగరంలో వర్షం నీరు ఎప్పటికప్పుడు బెయిల్ అవుట్ అయ్యే విధంగా బృందావనం అపార్ట్‌మెంట్(ఏటుకూరు వెళ్లే రోడ్డు) నుంచి పొన్నూరు రోడ్డులోని డ్రెయిన్‌కు అనుసంధానంగా 14వ వార్డులో 800 మీటర్ల పొడవుతో రూ.3.50కోట్లతో డ్రెయిన్ నిర్మాణ పనులు పార్ట్ పార్ట్‌లుగా చేపట్టారు. అయితే, ఇది మధ్యలోనే నిలిచిపోవడంతో వర్షపు నీరు బయటకు వెళ్లే పరిస్థితి లేదు. దీంతో నగరంలో వీధులన్నీ జలమయంగా మారుతున్నాయి. మూడు వంతెనలు వద్ద రైల్వే ట్రాక్ కింద నుంచి మరొక డ్రెయిన్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ వాటి అమలుకు పాలకులు తగిన చర్యలు తీసుకోవడం లేదు. రూ.5.50కోట్లుతో మూడు వంతెనలు ఆధునీకరించినప్పటికీ చిన్న వర్షం పడితే చాలు మోకాళ్లలోతు దాకా నీళ్లు వస్తున్నాయి. దీనికి ప్రత్నామ్నాయంగా రైల్వే ట్రాక్ కింద డ్రెయిన్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు కంకరగుంట అండర్ పాస్ వద్ద వర్షం పడిన ప్రతిసారి మునిగిపోతోంది. దీనికి కూడా పాలకులు శాశ్వత పరిష్కారం చూపాలని నగర వాసులు కోరుతున్నారు.