
పరిష్కార మార్గాలపై దృష్టి పెట్టని పాలకులు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వర్షం పడితే ఆ ప్రాంతం అంతా వర్షపు నీటితో నిండిపోయి ఆ ప్రభావం తూర్పు నియోజకవర్గంపై పడుతోంది. పశ్చిమ నుంచి వచ్చే మురుగు, వర్షపు నీరు 3వ వార్డులోని మొండిగేటు నుంచి బయటకు వెళుతుంటుంది. మొండిగేటు అవుట్ ఫాల్ డ్రెయిన్ వద్దకు 100శాతం మురుగునీరు వస్తే అందులో 10శాతం మాత్రమే బయటకు వెళుతోంది. ఆ ప్రభావం మొత్తం 3, 4, 8 వార్డులపై పడి పలు కాలనీలు నీట మునుగుతున్నాయి. దీని విస్తరణ కోసం పాలకులు, అధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదు.