
అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ప్రభుత్వం
ప్రజా ప్రయోజనాలతో వార్తలు ప్రచురించినప్పుడు అవి అధికార పార్టీకి అనుకూలంగా లేకపోతే సంబంధిత విలేకరులపై కేసులు పెట్టడం అధికార దుర్వినియోగం అవుతుంది. ప్రజల స్వేచ్ఛని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని విలేకరులపై, పత్రికలపై అక్రమ కేసులు పెట్టి వేధించడం ప్రభుత్వానికి తగదు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య పత్రికలు వారధి వంటివి. ప్రజా ప్రయోజనాలతో ఎలాంటి వార్తలనైనా ప్రచురించే హక్కు పత్రికలకు ఉంటుంది. అలాంటి స్వేచ్ఛను ఒక వర్గం అణచివేయడం దారుణమైన విషయం. ప్రజాహితం కోరే పత్రికా స్వేచ్ఛ ఈ సమాజంలో నిలబడాలి. విలేకరులపై తప్పుడు కేసులు పెట్టే సంస్కృతిని ఎవరైనా ఖండించాల్సిదే !
– మెరుగుపాల రాజారత్నం, సీనియర్ జర్నలిస్ట్

అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ప్రభుత్వం

అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ప్రభుత్వం