శలపాడులో దెబ్బతిన్న పంట పొలాల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

శలపాడులో దెబ్బతిన్న పంట పొలాల పరిశీలన

Sep 21 2025 5:47 AM | Updated on Sep 21 2025 5:47 AM

 శలపా

శలపాడులో దెబ్బతిన్న పంట పొలాల పరిశీలన

శలపాడులో దెబ్బతిన్న పంట పొలాల పరిశీలన జిమ్నాస్టిక్స్‌ జిల్లా టీం ఎంపిక బాలికను వేధించిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదు గంజాయి రహిత జిల్లాగా చేయడమే లక్ష్యం గుంటూరు ట్రాఫిక్‌ డీఎస్పీగా బెల్లం శ్రీనివాసరావు నరసరావుపేట: ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌ తెలుగుదేశం పార్టీలో చేరడంపై ఆ పార్టీ నాదెండ్ల మండల నాయకులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ శనివారం తమ పదవులు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్‌కు తమ రాజీనామా లేఖలు పంపారు. ఈ సందర్భంగా సాతులూరులోని టీడీపీ మండల కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షుడు బండారుపల్లి సత్యనారాయణ తన వర్గీయులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ముప్పై ఏళ్లుగా టీడీపీలో వివిధ బాధ్యతలు, ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలకు సేవ చేసిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకు కనీసం మాటమాత్రం తెలియపరచకుండా మర్రి రాజశేఖర్‌ను పార్టీలోకి ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో మర్రి రాజశేఖర్‌ తమపై తప్పుడు కేసులు పెట్టించటమే కాక ఆర్థికంగా నష్టపోయేలా చేశారంటూ ఆరోపించారు. మాజీ మంత్రి విడదల రజినీకి చిలకలూరిపేట ఇన్‌చార్జి బాధ్యతలు ఇవ్వడంతో ఆ పార్టీలో తనకు విలువ లేకపోవడంతోనే టీడీపీలో చేరాడని విమర్శించారు. మర్రి చేరికతో పార్టీ కోసం కష్టపడిన తమకు విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ అభిప్రాయాలు తీసుకోకుండా ఆయన్ను పార్టీలోకి తీసుకోవడంతో తాము టీడీపీని వీడుతున్నామని పలువురు నేతలు పేర్కొన్నారు.

చేబ్రోలు: భారీ వర్షాలు, వరదలకు మండలంలోని శలపాడు, వీరనాయకునిపాలెం గ్రామాల్లో నీట మునిగి దెబ్బతిన్న వరి పొలాలను శనివారం వ్యవసాయశాఖాధికారులు పరిశీలించారు. సాక్షి దినపత్రికలో శనివారం ప్రచురితమైన ‘‘రెక్కల కష్టం... వర్షార్పణం’’ కథనానికి అధికారులు స్పందించారు. ఈ సందర్భంగా స్థానిక ఏవో పి. ప్రియదర్శిని మాట్లాడుతూ శేకూరు, శలపాడు రెవెన్యూ గ్రామాల పరిధిలో రైతులు నాలుగు వేల ఎకరాల్లో వరి సాగు చేశారని తెలిపారు. పంట కూడా 30రోజులు పైబడిన దశలో ఉందన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు నీరు నిల్వ ఉన్న పొలాలను పరిశీలించామని, ప్రాథమిక నివేదికను జిల్లా వ్యవసాయశాఖాధికారికి సమర్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో వ్యయసాయశాఖ సిబ్బంది, మైలా రామరాజు, స్థానిక రైతులు పాల్గొన్నారు.

గుంటూరు వెస్ట్‌: బీఆర్‌ స్టేడియంలో శనివారం అండర్‌– 14, అండర్‌– 17, అండర్‌– 19 జిమ్నాస్టిక్స్‌ బాలబాలికల జిల్లా టీం సెలక్షన్లు నిర్వహించారు. అండర్‌– 14, 17 ఎంపికలు ఎస్జీఎఫ్‌ సెక్రటరీ గోపి, అండర్‌ –19 ఎంపికలు నరసింహారావు, కోచ్‌ ఆఫ్రోజ్‌ ఖాన్‌ ఆధ్వర్యంలో జరిగాయి.

తాడికొండ: బాలికను వేధిస్తున్న యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు తాడికొండ సీఐ సీహెచ్‌.వాసు శనివారం తెలిపారు. తాడికొండకు చెందిన యువతి గుంటూరులోని ఓ కళాశాలలో ఇంటర్‌ చదువుతోంది. గత పది నెలలుగా తాడికొండ గ్రామానికి చెందిన షేక్‌ అస్లామ్‌ యువతి కళాశాలకు వెళుతున్న సమయంలో వెంటబడుతున్నాడు. తనను ప్రేమించాలంటూ బలవంతం చేస్తూ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. యువతి విషయాన్ని కుటుంబ సభ్యలకు తెలిపింది. ఆమె తాతయ్య నిందితుడిని హెచ్చరించాడు. రెచ్చిపోయిన యువకుడు ఫోన్‌ చేసి తన ప్రేమను అంగీకరించకపోతే యువతితో పాటు ఆయన్ను చంపుతానని బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐ వాసు తెలిపారు.

జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌

నగరంపాలెం: జిల్లాను గంజాయి రహితంగా చేయడమే లక్ష్యమని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గంజాయి క్రయ, విక్రయాలు, సరఫరాపై కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. గడచిన రెండు రోజుల్లో 3.5 కిలోల గంజాయి సీజ్‌ చేసి, 22 మందిని అరెస్ట్‌ చేశామని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీలు, అవగాహన కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. గంజాయి కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై ప్రత్యేక నిఘాతో పాటు పీడీ యాక్ట్‌ ప్రయోగిస్తామని, ఆస్తుల జప్తునకు కూడా చర్యలు చేపడతామని వివరించారు. పోలీస్‌స్టేషన్‌ స్థాయిలోని ప్రత్యేక పోలీస్‌ బృందాలు, ఈగల్‌ బృందాల సమన్వయంతో గంజాయి నిర్మూలిస్తామ డ్రోన్‌ కెమెరాల సాయంతోనూ గుర్తిస్తామని తెలిపారు. జిల్లాలో చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని ఎస్పీ స్పష్టం చేశారు.

పట్నంబజారు (గుంటూరు ఈస్ట్‌): గుంటూరు నగర ట్రాఫిక్‌ డీఎస్పీగా బెల్లం శ్రీనివాసరావు శనివారం రాత్రి బాధ్యతలు స్వీకరించారు. 1992 బ్యాచ్‌కు చెందిన ఆయన గుంటూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో ఎస్‌ఐ, సీఐగా పని చేశారు. తెనాలి, గుంటూరు సీసీఎస్‌, ఎస్బీలో కూడా ఆయన సీఐగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ ఏడాది ఆయనకు డీఎస్పీగా పదోన్నతి లభించింది. ఈ క్రమంలోనే గుంటూరు ట్రాఫిక్‌ డీఎస్పీగా నియమించారు. బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసరావుకు ఈస్ట్‌, వెస్ట్‌ ట్రాఫిక్‌ సీఐలు అశోక్‌, సింగయ్యలు అభినందనలు తెలియజేశారు.

ఇలాగైతే కష్టం ‘మర్రి’?

మర్రి రాజశేఖర్‌పై చేరికపై తెలుగు తమ్ముళ్ల గుర్రు

పార్టీ సభ్యత్వాలకు పలువురు నాయకుల రాజీనామా

 శలపాడులో దెబ్బతిన్న పంట పొలాల పరిశీలన  1
1/3

శలపాడులో దెబ్బతిన్న పంట పొలాల పరిశీలన

 శలపాడులో దెబ్బతిన్న పంట పొలాల పరిశీలన  2
2/3

శలపాడులో దెబ్బతిన్న పంట పొలాల పరిశీలన

 శలపాడులో దెబ్బతిన్న పంట పొలాల పరిశీలన  3
3/3

శలపాడులో దెబ్బతిన్న పంట పొలాల పరిశీలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement