330 మెట్రిక్‌ టన్నుల యూరియా సరఫరా | - | Sakshi
Sakshi News home page

330 మెట్రిక్‌ టన్నుల యూరియా సరఫరా

Sep 19 2025 2:03 AM | Updated on Sep 19 2025 2:03 AM

330 మ

330 మెట్రిక్‌ టన్నుల యూరియా సరఫరా

330 మెట్రిక్‌ టన్నుల యూరియా సరఫరా లాటరీ విధానంలో 26 బార్లు కేటాయింపు ఎంపీడీవోలుగా ఉద్యోగోన్నతి సాగర్‌ ప్రాజెక్టును పరిశీలించిన కేఆర్‌ఎంబీ చైర్మన్‌

కొరిటెపాడు(గుంటూరు): జిల్లాకు గురువారం నర్మద కంపెనీకి చెందిన 330 మెట్రిక్‌ టన్నుల యూరియా సరఫరా అయింది. స్థానిక రెడ్డిపాలెం రైల్వేస్టేషన్‌ రేక్‌ పాయింట్‌కు వ్యాగన్ల ద్వారా చేరింది. స్టాక్‌ను రేక్‌ పాయింట్‌ అధికారి, గుంటూరు ఏడీఏ ఎన్‌.మెహనరావు పరిశీలించారు. జిల్లాకు వచ్చిన 330 మెట్రిక్‌ టన్నుల్లో మార్క్‌ఫెడ్‌కు 250 మెట్రిక్‌ టన్నులు, ప్రైవేటు డీలర్స్‌కు 80 మెట్రిక్‌ టన్నులు సరఫరా చేయనున్నట్లు ఆయన తెలిపారు.

ఇంకా మిగిలిపోయిన 41 బార్లు

నెహ్రూనగర్‌: గుంటూరు జిల్లాలో లాటరీ విధానం ద్వారా 26 బార్లు కేటాయించారు. కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ సమావేశ మందిరంలో గురువారం జాయింట్‌ కలెక్టర్‌ ఆశుతోష్‌ శ్రీవాత్సవ సమక్షంలో ఎకై ్సజ్‌ అధికారులు లాటరీ తీశారు. జిల్లాకు మొత్తం 110 బార్లు ప్రభుత్వం కేటాయించగా వీటికి గత నెల 30న లాటరీ తీశారు. అయితే, ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాలేదు. అధికారులు 43 బార్లను మాత్రమే కేటాయించారు. మిగిలిన 67 బార్లకు తిరిగి ఈ నెల 3 నుంచి దరఖాస్తులు 14 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అయినా ఆశించిన స్థాయిలో రాకపోవడంతో మరో మూడు రోజులు పెంచారు. 17వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించారు. గురువారం జేసీ చేతుల మీదుగా 67 బార్లకు గానూ 26కు మాత్రమే లాటరీ తీసి కేటాయించారు. ఇంకా 41 మిగిలిపోయాయి. వీటికి తిరిగి నోటిఫికేషన్‌ ఇచ్చే అవకాశం ఉన్నట్లు ఎకై ్సజ్‌ అధికారులు చెబుతున్నారు. కార్యక్రమంలో ఎకై ్సజ్‌ శాఖ డెప్యూటీ కమిషనర్‌ డాక్టర్‌ కె. శ్రీనివాసులు, జిల్లా ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ అరుణకుమారి, డీఆర్వో ఎన్‌ఎస్‌కే ఖాజావలి, ఏఈఎస్‌ మారయ్య బాబు, సిబ్బంది పాల్గొన్నారు.

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో ఉద్యోగోన్నతిపై ఎంపీడీవోలుగా నియమితులైన అధికారులకు జెడ్పీ చైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టినా నియామక ఉత్తర్వులను అందజేశారు. గురువారం జెడ్పీ క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖలో పని చేస్తున్న నలుగురు ఏవోలు, ఆరుగురు డిప్యూటీ ఎంపీడీవోలకు ఎంపీడీవోలుగా ఉద్యోగోన్నతి కల్పిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ విడుదల చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా నియామకపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు, డీప్యూటీ సీఈవో సీహెచ్‌ కృష్ణ, అకౌంట్స్‌ అధికారి శామ్యూల్‌ పాల్‌, జీ సెక్షన్‌ ఏవో పూర్ణచంద్రారెడ్డి, మోహన్‌రావు పాల్గొన్నారు.

విజయపురి సౌత్‌: కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్‌ బీపీ పాండే ఆధ్వర్యంలో సభ్యులు కేకే జాన్గిడ్‌ తదితరులతో కలిసి గురువారం నాగార్జునసాగర్‌ ప్రాజెక్టును సందర్శించారు. సాగర్‌ ప్రధాన డ్యామ్‌, గ్యాలరీలు, రైట్‌ కెనాల్‌, పవర్‌ హౌస్‌, ప్రధాన జల విద్యుత్‌ కేంద్రాన్ని పరిశీలించారు. స్వచ్ఛతా హీ సేవ క్యాంపెయిన్‌లో భాగంగా ప్రాజెక్టు అధికారులు సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ప్రధాన డ్యాం, పైలాన్‌ పిల్లర్‌ పార్కులను శుభ్రపరిచారు. పార్కులో మొక్కలు నాటారు. శుక్రవారం లో లెవెల్‌ కెనాల్‌, లెఫ్ట్‌ కెనాల్‌లను సందర్శించనున్నారు. కేఆర్‌ఎంబీ ఈఈ శ్రీనివాసరావు, సాగర్‌ డ్యాం ఈఈ సీతారాం, డీఈ అశోక్‌ ఆనంద్‌, ఏఈ కృష్ణయ్య తదితరులు ఉన్నారు.

330 మెట్రిక్‌ టన్నుల యూరియా సరఫరా  
1
1/3

330 మెట్రిక్‌ టన్నుల యూరియా సరఫరా

330 మెట్రిక్‌ టన్నుల యూరియా సరఫరా  
2
2/3

330 మెట్రిక్‌ టన్నుల యూరియా సరఫరా

330 మెట్రిక్‌ టన్నుల యూరియా సరఫరా  
3
3/3

330 మెట్రిక్‌ టన్నుల యూరియా సరఫరా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement