
కంట్రోల్ రూం ఏర్పాటు
జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా
గుంటూరు వెస్ట్ : సీజనల్ వ్యాధుల సమాచారానికి కలెక్టరేట్‌లో 0863– 2234014 నంబరుతో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా గురువారం తెలిపారు. జిల్లాలో ఏ ప్రాంతంలో అయినా ఆరోగ్య సంబంధిత సమస్యలు, అంటు వ్యాధులు, అతిసార, డెంగీ, మలేరియాలపై తక్షణం కంట్రోల్ రూంకు సమాచారం అందించాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జిల్లాలో డయేరియా కేసుల అంశంపై మాట్లాడుతూ జీజీహెచ్‌లో బుధవారానికి 33 మంది 17 ప్రాంతాల నుంచి చేరారని, ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. వైద్యుల ప్రాథమిక నివేదిక మేరకు ఆహారం కలుషితం వల్లే డయేరియా ప్రబలిందని ఆమె పేర్కొన్నారు.