
తురకపాలెంలో జెడ్పీ చైర్‌పర్సన్ పర్యటన
గుంటూరు రూరల్: తురకపాలెం ప్రజలు ఆందోళన చెందవద్దని ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా తెలిపారు. అధికారులతో కలిసి గురువారం ఆమె సందర్శించారు. గ్రామంలో సంభవించిన మరణాలపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇటువంటి మరణాలు సంభవించకూడదని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఎంఅండ్‌హెచ్‌ఓ కె. విజయలక్ష్మి, డీపీఓ నాగసాయికుమార్ , డెప్యూటీ సీఈవో చొప్పర కృష్ణ, ఎంపీడీవో బండి శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.