
మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి
మంగళగిరి: మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యమివ్వడం వల్ల ఆత్మహత్యలను నివారించవచ్చని ఎయిమ్స్ ప్రొఫెసర్, డైరెక్టర్ డాక్టర్ అహెంతమ్ శాంత సింగ్ తెలిపారు. నగర పరిధిలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో ప్రపంచ ఆత్మహత్యల నివారణ వారోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గురువారం ముగింపు సందర్భంగా డాక్టర్ అహెంతమ్ శాంత సింగ్ మాట్లాడుతూ ఆత్మహత్యల నివారణకు హెల్ప్ లైన్ నంబర్ 7331115179ను ప్రారంభించినట్లు తెలిపారు. విద్యార్థుల్లో మానసిక ఆరోగ్యం,సృజనాత్మకత, విమర్శనాత్మకత ప్రోత్సహించే విధంగా పెయింటింగ్, వక్తృత్వం పోటీలు నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో ఎయిమ్స్ అధికారులు, వైద్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రతిజ్ఞ చేస్తున్న డైరెక్టర్ అహెంతమ్ శాంత సింగ్ తదితరులు
ప్రతిజ్ఞ చేస్తున్న మెడికల్ విద్యార్థులు

మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి