వైద్య విద్యను అమ్ముకుంటున్న బాబు | - | Sakshi
Sakshi News home page

వైద్య విద్యను అమ్ముకుంటున్న బాబు

Sep 19 2025 1:49 AM | Updated on Sep 19 2025 1:49 AM

వైద్య

వైద్య విద్యను అమ్ముకుంటున్న బాబు

● ‘చలో మెడికల్‌ కాలేజ్‌’ను జయప్రదం చేయండి ● వైఎస్సార్‌ సీపీ యువజన, విద్యార్థి విభాగం నేతల పిలుపు ● నేడు పిడుగురాళ్లలో నిర్వహణ

పట్నంబజారు(గుంటూరు ఈస్ట్‌): వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం నిర్వహించ తలపెట్టిన చలో మెడికల్‌ కాలేజ్‌ (పిడుగురాళ్ల) కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వైఎస్సార్‌ సీపీ యువజన, విద్యార్థి విభాగం నేతలు పిలుపునిచ్చారు. బృందావన్‌ గార్డెన్స్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఆళ్ల ఉత్తేజ్‌రెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ వినోద్‌ ఆధ్వర్యంలో చలో మెడికల్‌ కాలేజ్‌ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యార్థులకు వైద్య విద్యను పేదలకు వైద్యాన్ని సమూలంగా సదూరం చేసేందుకు కుట్రలు పన్నుతోందని విమర్శించారు. దీనిపై బాధ్యత గల యువజన, విద్యార్థి సంఘాలుగా ప్రభుత్వ విధానాలపై ప్రతిఘటిస్తామని తెలిపారు. మెడికల్‌ కళాశాలను ప్రైవేటీకరణ చేసి.. కోట్లాది రూపాయాల ప్రభుత్వ ఆస్తులను వాళ్ల వారికి ధారాదత్తం చేసేందుకు యోచిస్తున్నారని మండిపడ్డారు. కచ్చితంగా ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో ఎంతటి పోరాటాలకైనా వెనుకాడబోమని హెచ్చరించారు. వైఎస్సార్‌ సీపీ యువజన, విద్యార్థి విభాగం నేతలు కళ్లం హరికృష్ణారెడ్డి, కోటేశ్వరరావుయాదవ్‌, అనిల్‌రెడ్డి, షేక్‌ సుభాని, శశిధర్‌, జగదీష్‌, రవి, భానుప్రకాష్‌ పాల్గొన్నారు.

తెనాలిలో...

ప్రభుత్వ వ్యయంతో నిర్మించిన మెడికల్‌ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం పేదలకు వైద్య విద్యను దూరం చేయటమేనని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి బడుగు కోటయ్య అన్నారు. కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. శుక్రవారం (నేడు) నిర్వహించ తలపెట్టిన ‘చలో మెడికల్‌ కాలేజ్‌ పల్నాడు జిల్లా పిడుగురాళ్ల’ కార్యక్రమ పోస్టర్‌ను గురువారం స్థానిక గంగానమ్మపేటలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం కోటయ్య విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ రంగంలోని మెడికల్‌ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తే, పేద విద్యార్థులకు వైద్యవిద్య దూరం అవుతుందని తెలిపారు. తెనాలి నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పల్లె రోహిత్‌ శామ్యూల్‌ మాట్లాడుతూ స్వార్థ ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతోందని విమర్శించారు. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసే ప్రభుత్వ తీరును నిరసించేందుకు యువజనులు, విద్యార్థులు ముందుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ రూరల్‌ మండల విద్యార్థి విభాగం అధ్యక్షుడు నూకతోటి అభిషేక్‌, కొల్లిపర మండల విద్యార్థి విభాగం అధ్యక్షుడు దరిశి రవితేజ, రాష్ట, జిల్లా విద్యార్థి నాయకులు మధిర రవితేజ, పాటిబండ్ల హోసన్న, మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మంచాల సుకుమార్‌, స్థానిక విద్యార్థి నాయకులు దిడ్ల సునీల్‌, చొక్కా సంపత్‌, మన్నవ ప్రదీప్‌, కోడూరి నాగమల్లేశ్వరరావు, మున్సిపల్‌ కౌన్సిలర్లు యాతాటి అనిల్‌, షేక్‌ దుబాయ్‌బాబు, పార్టీ నాయకుడు అక్కిదాసు కిరణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

వైద్య విద్యను అమ్ముకుంటున్న బాబు1
1/1

వైద్య విద్యను అమ్ముకుంటున్న బాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement