అర్జీల పరిష్కారంలో అశ్రద్ధ వద్దు ! | - | Sakshi
Sakshi News home page

అర్జీల పరిష్కారంలో అశ్రద్ధ వద్దు !

Sep 9 2025 8:34 AM | Updated on Sep 9 2025 12:40 PM

అర్జీ

అర్జీల పరిష్కారంలో అశ్రద్ధ వద్దు !

అర్జీల పరిష్కారంలో అశ్రద్ధ వద్దు ! ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలి నష్టపరిహారం ఎప్పుడిస్తారు ? బాధితులకు న్యాయం చేయాలి

కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి

గుంటూరు వెస్ట్‌: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన ప్రతి అర్జీని నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ బియాండ్‌ ఎస్‌ఎల్‌ఏలోకి వెళ్లకూడదని కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌.ఆర్‌.శంకరన్‌ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. సీఎంఓ నుంచి అందిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. తమ శాఖకు వస్తున్న అర్జీల పరిష్కారంపై అధికారులకు పూర్తి అవగాహన ఉండాలని తెలిపారు. అర్జీల పరిష్కారంపై ప్రజల్లో సంతృప్తి స్థాయి శాతం తగ్గుతుందని, వాటిని పెంచేలా అధికారులు కృషి చేయాలని ఆమె చెప్పారు. కోర్టు కేసులకు సంబంధించి నిర్ణీత సమయంలో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించారు. అనంతరం వచ్చిన 276 అర్జీలను డీఆర్వో ఖాజావలి, ఆర్డీఓ ఓ. శ్రీనివాసరావు , డెప్యూటీ కలెక్టర్లు గంగరాజు, లక్ష్మీకుమారి, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ శ్రీనివాస్‌, జిల్లా అధికారులు పరిశీలించారు.

పట్టణంలోని 1వ డివిజన్‌లోని నారా భువనేశ్వరి కాలనీ ( పందుల కాలనీ)లో 30 సంవత్సరాల నుంచి నివాస ఉంటున్నారు. పందులను పెంచుకుని జీవనం పొందడమే వారి ప్రధాన వృత్తి. ఇక్కడ ఇప్పటి వరకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేదు. మౌలిక సదుపాయాల కల్పన కూడా లేదు.

– పరిశపోగు శ్రీనివాసరావు మాదిగ, నవ్యాంద్ర మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు

మాది తెనాలి మండలం చిన్న రావూరు డొంక. ఫిబ్రవరిలో మా కాలనీలోని యానాది కులానికి చెందిన ముగ్గురు పెదకాకాని గోశాలలో పనికి వెళ్లి విద్యుత్‌ షాక్‌తో మరణించారు. కలెక్టర్‌తోపాటు ఆర్డీఓ బాధిత కుటుంబాలకు ఉద్యోగంతో పాటు ఇళ్ల స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఎన్నిసార్లు తిరిగినా స్పదించడం లేదు.

– బాధిత కుటుంబ సభ్యులు

తురకపాలెంలో మూడు నెలల్లోనే 30 మంది అకాల మరణాలకు పాల్పడ్డారు. ఇంత జరుగున్నా ప్రభుత్వం ఏం చేస్తుంది.. ముందే జాగ్రత్తపడాలి కదా ! అధికారులు కనీసం తమ శాఖలపై సమీక్షలు కూడా జరపడం లేదు. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.25 లక్షలతోపాటు మరణించిన వారి కుటుంబాలకు వితంతు, ప్రత్యేక పెన్షన్లు అందించాలి. గ్రామానికి ప్రస్తుతం అందుతున్న మంచినీటి సౌకర్యం ఏ మాత్రం సరిపోవడం లేదు. దీన్ని పెంచాలి. గ్రామంలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి వైద్యుల నియామకంతో పాటు మందులను అందుబాటులో ఉంచాలి. మరణాలపై న్యాయ విచారణ జరపాలి. – సీపీఎం జిల్లా నాయకులు

అర్జీల పరిష్కారంలో అశ్రద్ధ వద్దు ! 1
1/2

అర్జీల పరిష్కారంలో అశ్రద్ధ వద్దు !

అర్జీల పరిష్కారంలో అశ్రద్ధ వద్దు ! 2
2/2

అర్జీల పరిష్కారంలో అశ్రద్ధ వద్దు !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement