పశ్చిమ డెల్టాకు 6,522 క్యూసెక్కులు విడుదల | - | Sakshi
Sakshi News home page

పశ్చిమ డెల్టాకు 6,522 క్యూసెక్కులు విడుదల

Sep 12 2025 6:21 AM | Updated on Sep 12 2025 6:21 AM

పశ్చి

పశ్చిమ డెల్టాకు 6,522 క్యూసెక్కులు విడుదల

పశ్చిమ డెల్టాకు 6,522 క్యూసెక్కులు విడుదల ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉపాధ్యాయుల నిరసన తెనాలిలో డెంగీ కలకలం డీఎల్‌డీవో కార్యాలయ పనులు పూర్తి చేయాలి

దుగ్గిరాల: విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌ నుంచి 6,522 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజ్‌ వద్ద 12 అడుగులు నీటిమట్టం ఉంది. దుగ్గిరాల సబ్‌ డివిజన్‌ హైలెవెల్‌కి 180 క్యూసెక్కులు, బ్యాంక్‌ కెనాల్‌ 1,736, తూర్పు కాలువకు 637, పశ్చివ కాలువకు 226, నిజాపట్నం కాలువకు 432, కొమ్మూరు కాలువకు 2,800 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. బ్యారేజ్‌ నుంచి సముద్రంలోకి 36,250 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఆర్థిక సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఏపీటీఎఫ్‌ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గురువారం జిల్లాలోని అన్ని మండలాల్లో ఉపాధ్యాయులు గురువారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె. బసవ లింగారావు, మొహమ్మద్‌ ఖాలీద్‌ మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక డిమాండ్లలో ప్రభుత్వ సాచివేత ధోరణికి వ్యతిరేకంగా నిరసన వారం ఉద్యమ కార్యాచరణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా వందలాది మంది ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలను ధరించి, ప్రదర్శనలు నిర్వహించారని తెలిపారు. శుక్రవారం అన్ని మండల కేంద్రాల్లో ప్రదర్శనలు నిర్వహించి, తహసీల్దార్లకు వినతి పత్రాలు సమర్పించనున్నట్లు చెప్పారు. ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు.

తెనాలి అర్బన్‌: తెనాలి పట్టణంలో అధికారికంగా డెంగీ కేసు నమోదైంది. ఈ విషయం బయటకు రావడంతో పట్టణంలో కలకలం మొదలైంది. తెనాలి 17వ వార్డుకు చెందిన 60 సంవత్సరాల వ్యక్తి అనారోగ్యంతో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు చికిత్స నిమిత్తం కొద్దిరోజుల కిందట వెళ్లాడు. అతడిలో డెంగీ లక్షణాలు కనిపించడంతో వెంటనే వైద్యులు రక్త పరీక్షలు చేయించడంతో వ్యాధి నిర్ధారణ అయింది. విషయాన్ని ప్రభుత్వ వైద్యశాల అధికారులు తెనాలి మున్సిపల్‌ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో వ్యక్తి నివసించే ప్రాంతంలో మురుగు కాల్వలను బాగు చేయించి బ్లీచింగ్‌, స్ప్రేయింగ్‌ చేయిస్తున్నారు.

సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని డీఎల్‌డీవో కార్యాలయ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని పంచాయతీరాజ్‌ కమిషనర్‌ మైలవరపు కృష్ణతేజ అన్నారు. గుంటూరు రోడ్‌లోని అయ్యప్పస్వామి దేవాలయం పక్కన గల పంచాయతీరాజ్‌ గెస్ట్‌ హౌస్‌ను సత్తెనపల్లి డీఎల్‌డీవో కార్యాలయానికి ఇటీవల కేటాయించారు. దీంతో గురువారం ఆయన దానిని పరిశీలించారు. కార్యాలయంలో చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రూ. 10 లక్షలు కేటాయించాల్సిందిగా సీఈఓకు సూచించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి నాగేశ్వరనాయక్‌, సత్తెనపల్లి డీఎల్‌డీవో బి.రాజగోపాల్‌, సత్తెనపల్లి ఇన్‌చార్జి ఎంపీడీవో టి.శ్రీనివాసరావు, ఇన్‌చార్జ్‌ డిప్యూటీ ఎంపీడీవో షేక్‌ రెహమాన్‌, పంచాయతీరాజ్‌ ఏఈ కె.రామ్‌మోహన్‌ సింగ్‌ పాల్గొన్నారు.

పశ్చిమ డెల్టాకు 6,522 క్యూసెక్కులు విడుదల 
1
1/2

పశ్చిమ డెల్టాకు 6,522 క్యూసెక్కులు విడుదల

పశ్చిమ డెల్టాకు 6,522 క్యూసెక్కులు విడుదల 
2
2/2

పశ్చిమ డెల్టాకు 6,522 క్యూసెక్కులు విడుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement