
బాపట్ల జిల్లా కలెక్టర్‌గా వినోద్‌కుమార్ నియామకం
సాక్షి ప్రతినిధి, బాపట్ల: బాపట్ల జిల్లా కలెక్టర్‌గా వి.వినోద్‌కుమార్ నియమితులయ్యారు. అనంతపురం కలెక్టర్‌గా ఉన్న ఆయనను బాపట్లకు బదిలీ చేస్తూ గురువారం సాయంత్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 2015 ఐఏఎస్ క్యాడర్‌కు చెందిన వినోద్‌కుమార్ ఏప్రిల్ 2024లో అనంతపురం కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. కర్ణాటకు చెందిన వినోద్ కుమార్ డాక్టర్ చదువు పూర్తి చేసి 2015లో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. 2016 – 17లో అనంతపురం అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేశారు. 2017– 19లో రంపచోడవరం సబ్ కలెక్టర్, 25 జూన్ 2019 నుంచి 17 సెప్టెంబరు 2019 వరకు ఐటీడీఏ పార్వతీపురం, 11 మే 2020 నుంచి 11 ఆగస్టు 2020 వరకు నెల్లూరు అడిషనల్ జాయింట్ కలెక్టర్‌గా పనిచేశారు. 2020– 23లో ఏపీ హెల్త్ సిస్టం స్ట్రెంతెనింగ్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా వ్యవహరించారు. 12 ఏప్రిల్ 2023 నుంచి 4 ఏప్రిల్ 2024 వరకు స్కిల్ డెవలప్‌మెంట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. 9 జూలై 2024న బాపట్ల కలెక్టర్‌గా వచ్చిన జె.వెంకట మురళిని ఏడాది తర్వాత ప్రభుత్వం బదిలీ చేసింది.