
సీతారాం ఏచూరి స్ఫూర్తితో మతోన్మాదంపై పోరాడాలి
సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజి
లక్ష్మీపురం: సీపీఎం అగ్రనేత సీతారాం ఏచూరి స్ఫూర్తితో మతోన్మాదంపై పోరాడాలి అని సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ అన్నారు. గుంటూరు బ్రాడీపేటలోని సీపీఎం జిల్లా కార్యాలయంలో సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ‘సీతారాం ఏచూరి ఓ సోషలిస్టు ఆచరణ పథం’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు ఎన్.భావన్నారాయణ, వై.కృష్ణకాంత్, బి.ముత్యాలరావు, ఎం.ఎ చిష్టీ, కె.నాగేశ్వరరావు, బి.శ్రీనివాసరావు, ఎం.కిరణ్, ఎం.సాంబశివరావు, జి.వెంకట్రావు, సతీష్ తదితరలు పాల్గొన్నారు.