
రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలకు 19 మందికి అర్హత
తూములూరు(కొల్లిపర): ఉమ్మడి గుంటూరు జిల్లా స్థాయి 69వ ఎస్‌జీఎఫ్ అండర్–19 సైక్లింగ్ పోటీలు మండల పరిధిలో తూములూరు గ్రామంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్‌లో గురువారం ఎంఈఓ–2 ఝూన్సీలత, అండర్–19 సూల్క్ గేమ్స్ సెక్రటరీ నరసింహారావు సమక్షంలో నిర్వహించారు. వారు మాట్లాడుతూ రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలకు 19 మంది అర్హత సాధించినట్లు తెలిపారు. 19 మంది విద్యార్థులను పాఠశాల హెచ్‌ఎం కె.నాగలక్ష్మి, పిట్టలవానిపాలెం గవర్నమెంట్ కాలేజి ఫిజికల్ డైరెక్టర్ ఎస్.సుధాకర్‌రెడ్డి, గుంటూరు సైక్లింగ్ కోచ్ కనకారావు, పీఈటీ కవి, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయుడు ఎస్.సాంబశివరావు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.