
రాష్ట్రంలో అతిపెద్ద సంఘం ఏపీ ఎన్జీజీవో
గుంటూరు మెడికల్: ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యవర్గం, అన్నీ తాలూకా కార్యవర్గ సభ్యులతో స్థానిక ఎన్జీజీవో హోంలో రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.వి రమణలు కొత్త జిల్లాల పునర్విభజన సందర్భంగా నూతన ఆడహాక్ కార్యవర్గ సభ్యుల ఎన్నిక సమావేశం శుక్రవారం ఎన్జీవో రిక్రియేషన్ హాలులో జరిగింది. సమావేశానికి గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. అలపర్తి విద్యాసాగర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో తమ సంఘం 205 తాలూకాలతో అత్యధిక సంఖ్యలో ఉద్యోగ సంఘాలతో కలిసి అతిపెద్ద జేఏసీ సంఘంగా ఉద్యోగుల ప్రయోజనాల కోసం పనిచేస్తుందని వెల్లడించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.వి.రమణ మాట్లాడుతూ సంఘాన్ని పటిష్టపరిచేందుకు ప్రతి ఒక్క సభ్యుడు సహాయ సహకారాలు అందించాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి శ్యాంసుందర్‌లు మాట్లాడుతూ ఉద్యోగుల ప్రయోజనాలు సాధించడంలో తాము శాయశక్తుల కృషి చేస్తామని చెప్పారు. ఏఎన్‌ఎంలు విధి నిర్వహణలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను, పదోన్నతి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని రాష్ట్ర నాయకులు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా అడహాక్ కమిటీ చైర్మన్‌గా ఎం.రామకృష్ణ, కన్వీనర్ కే.నాగేశ్వరరావు, ట్రెజరర్ బ్రహ్మహేశ్వరరావు, సభ్యులు రామయ్య, అప్పారావు, వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావులను నియమించారు. వీరి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు జరిగి నవంబర్ నాటికి ఏ.పీ ఎన్జీజివో సంఘ పల్నాడు జిల్లా శాఖ నూతన కార్యవర్గం ఏర్పడుతుందని చెప్పారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు జగదీష్, రంజిత్ నాయుడు, రామ్ ప్రసాద్, కార్యవర్గ సభ్యులు, ఏఐజిఎఫ్ మహిళ విభాగ కన్వీనర్ రాజ్యలక్ష్మి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగూర్ షరీఫ్, జిల్లా నాయకులు సుకుమార్, కూరాకుల శ్రీనివాసరావు, శ్రీవాణి, కృష్ణకిషోర్, సయ్యద్ జానీబాషా, విజయ్, విజయలక్ష్మి, నగర అధ్యక్ష కార్యదర్శులు సూరి కళ్యాణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పలువురు ఎన్జీవో నాయకులు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.
విజయ్‌కుమార్‌కు ఏపీ ఎన్జీజీవో
ఆర్థిక సాయం
గుంటూరు జీజీహెచ్ కాంట్రాక్టు మేల్ నర్సుగా విధులు నిర్వహిస్తున్న వి.విజయ్‌కుమార్ అమెరికాలో అక్టోబరులో జరగనున్న వరల్డ్‌కప్ పారాసిట్టింగ్ వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈనేపథ్యంలో శుక్రవారం గుంటూరులోని ఏపీ ఎన్జీజీవో అసోసియేషన్ కార్యాలయంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ చేతుల మీదుగా జిల్లా నేతలు విజయకుమార్‌కు రూ.10వేల చెక్కు అందజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు, సెక్రటరీ శ్యామ్‌సుందర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ నాగూర్ షరీఫ్, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్