తోపుదుర్తి భాస్కర్ రెడ్డి మృతిపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి | YS Jagan condoles the death of Topudurthi Bhaskar Reddy | Sakshi
Sakshi News home page

తోపుదుర్తి భాస్కర్ రెడ్డి మృతిపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి

Sep 12 2025 6:20 PM | Updated on Sep 12 2025 7:05 PM

YS Jagan condoles the death of Topudurthi Bhaskar Reddy

తాడేపల్లి :   వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి మృతిపై పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ పార్టీకి చెందిన అనంతపురం జిల్లా సీనియర్‌ నాయకుడు తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి ఆకస్మిక మరణం దిగ్శ్రాంతికి గురి చేసిందని, క్రమ శిక్షణ కలిగిన నాయకుడిగా పార్టీకి ఆయన అందించిన సేవలు మరిచిపోలేనివని కొనియాడారు.

‘ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాదించాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను’ అని వైఎస్‌ జగన్‌ సంతాపం వ్యక్తం చేశారు.  ఈ మేరకు ట్వీట్‌ చేశారు వైఎస్‌ జగన్‌. 

 

కాగా,  శుక్రవారం(సెప్టెంబర్‌ 12) మధ్యాహ్న సమయంలో తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి  తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ను హుటాహుటీనా ఆస్పత్రికి తరలించిన ఫలితం లేకుండా పోయింది. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. భాస్కర్ రెడ్డి మృతిపట్ల రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన చిన్నాన్న భాస్కర్‌రెడ్డి మృతిపట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారాయన. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement