శ్రీ గురుభ్యో నమః | - | Sakshi
Sakshi News home page

శ్రీ గురుభ్యో నమః

Sep 5 2025 5:20 AM | Updated on Sep 5 2025 5:20 AM

శ్రీ గురుభ్యో నమః

శ్రీ గురుభ్యో నమః

● నేడు జిల్లాస్థాయి గురుపూజోత్సవం ● 54 మంది ఉత్తమ ఉపాధ్యాయులతో జాబితా విడుదల

గుంటూరు ఎడ్యుకేషన్‌: మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు 54 మంది ఎంపికయ్యారు. తొమ్మిది మంది గ్రేడ్‌–2 హెచ్‌ఎంలతో పాటు వివిధ కేటగిరీల వారీగా స్కూల్‌ అసిస్టెంట్‌, ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం, ఎస్జీటీలను ఎంపిక చేశారు. జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి ఆమోదంతో జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక జాబితా విడుదల చేశారు. జిల్లా కలెక్టరేట్‌ వద్ద ఉన్న రెవెన్యూ కల్యాణ మండపంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు ప్రదానం చేయనున్నారు.

● గ్రేడ్‌–2 హెచ్‌ఎంల విభాగంలో సీహెచ్‌. మంజులాదేవి, శ్రామికనగర్‌ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల (మంగళగిరి మండలం), బి. రాజీవ్‌రత్న, జెడ్పీ హైస్కూల్‌ (నూతక్కి), కె.లాజర్‌బాబు, మున్సిపల్‌ హైస్కూల్‌ (నేతాజీనగర్‌), వై.శేషతల్ప సాయి, జెడ్పీ హైస్కూల్‌ (చింతలపూడి), ఏ.తిరుమలేష్‌, జెడ్పీ హైస్కూల్‌ (తురకపాలెం), ఎం.నాగేశ్వరరావు, జెడ్పీ హైస్కూల్‌ (కొలకలూరు), ఎస్‌.శ్రీనివాసరావు, మున్సిపల్‌ హైస్కూల్‌, బీఆర్‌ నగర్‌ (మంగళగిరి), ఈపూరి అరుణ (జెడ్పీ హైస్కూల్‌ చిర్రావూరు), పొట్లూరి విజయలక్ష్మి (జెడ్పీ హైస్కూల్‌ శేకూరు),

● ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం విభాగంలో ఎంపీపీ స్కూల్‌ కె.శ్రీనివాసరావు (బీసీ), పేరేచర్ల), బి.జగన్నాథనాయక్‌ (ఏవీఆర్‌ రజకపేట (తెనాలి), కొత్తపల్లి నాగజ్యోతి, ఫిజికల్‌ సైన్స్‌ అధ్యాపకురాలు (డైట్‌, బోయపాలెం)

● స్కూల్‌ అసిస్టెంట్‌ విభాగంలో జిల్లెళ్లపల్లి వెంకయ్య, జెడ్పీ హైస్కూల్‌ (పెదకాకాని), అహ్మదున్నీసా, ఎంపీయూపీ స్కూల్‌ (నులకపేట), తోట రామలీల, జెడ్పీ హైస్కూల్‌ (కొర్నెపాడు), కొనికి శ్రీనివాసరావు, జెడ్పీ హైస్కూల్‌ (మామిళ్లపల్లి), అవనిగడ్డ వెంకటరెడ్డి, జెడ్పీ హైస్కూల్‌ (గొట్టిపాడు), గుడిపూడి సత్యనారాయణ, జెడ్పీ హైస్కూల్‌ (మందడం), సీహెచ్‌. ప్రమీలాదేవి, జెడ్పీ హైస్కూల్‌ (కొండపాటూరు), శంకరమంచి వరలక్ష్మి, కేవీఆర్‌ జెడ్పీ హైస్కూల్‌ (తుళ్లూరు), సీహెచ్‌. శంకరరెడ్డి, కేసీహెచ్‌ఎస్‌ (కొత్తరెడ్డిపాలెం), కె.జయరావు, జెడ్పీ హైస్కూల్‌ (కొర్రపాడు), ఎస్‌.వెంకటరెడ్డి, జెడ్పీ హైస్కూల్‌ (వెనిగండ్ల), షేక్‌ సలీమ్‌, జెడ్పీ హైస్కూల్‌ (జీజీపాలెం), కన్నెగంటి శ్రీనివాసరావు, జెడ్పీ హైస్కూల్‌ (ఏటుకూరు), తోకల ఆంజనేయులు, జెడ్పీ హైస్కూల్‌ (ఉండవల్లి), ఆర్‌. విజయకుమారి, జెడ్పీ హైస్కూల్‌ (దొప్పలపాడు), యు.ఉమాదేవి, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల (చౌత్రా, గుంటూరు), ఏ.నాగమణి, ఎన్‌ఎస్‌ఎస్‌ఎం హైస్కూల్‌ (తెనాలి).

–ఎస్జీటీ విభాగంలో షేక్‌ అబ్దుల్‌ హనీఫ్‌, ఎంపీపీ స్కూల్‌ (మేడికొండూరు), మండా శ్రీదేవి, ఎంపీపీ స్కూల్‌, స్వర్ణాంధ్రనగర్‌ (గుంటూరు), ఎస్‌.కోటేశ్వరరావు, ఎంపీపీ స్కూల్‌ (దుగ్గిరాల), ఎండీ కరీముల్లా, ఎంపీపీ స్కూల్‌ (ఈమని), ఎం.మోహనకృష్ణ, ఎంపీపీ స్కూల్‌ (మోరంపూడి), పాలెం సాంబశివరావు, ఎంపీపీ స్కూల్‌ (వడ్డేశ్వరం), ఏ. హరివరప్రసాద్‌, ఎంపీపీ స్కూల్‌, జీఎంపీ (కొలకలూరు), పి.శ్రీధర్‌, ఎంపీయూపీఎస్‌ (లేమల్లెపాడు), డి.ఉమాదేవి, మోడల్‌ ప్రైమరీ స్కూల్‌ (వల్లభాపురం), దాసరి అలివేలు కుమారి (ఎంపీపీ స్కూల్‌, కొల్లిపర), పి.శ్రీనివాసమూర్తి, ఎంపీపీ స్కూల్‌ (వేజెండ్ల), ఎంవీఎస్‌ లక్ష్మీకుమారి, ఎంపీపీ స్కూల్‌ (వేజెండ్ల), ఎం.జ్యోతి, ఎంపీపీ స్కూల్‌ (కాకుమాను), బి.కృష్ణకిశోర్‌, ఎంపీపీ స్కూల్‌ (దాసరిపాలెం), వి.వినోద్‌, ఎంపీపీ స్కూల్‌ (సరిపూడి), ఎస్‌.కోటేశ్వరరావు, ఎంపీపీ స్కూల్‌ (రాయపూడి), సీహెచ్‌ ఆదినారాయణ, ఎంపీపీ స్కూల్‌ (నెక్కల్లు), కె.సైదా నాయక్‌, మున్సిపల్‌ ప్రైమరీ స్కూల్‌ (మంగళగిరి), జి.సుందరరాజు, ఎంపీపీ స్కూల్‌ (చినకాకాని), కె.సువర్ణకుమారి, మోడల్‌ ప్రైమరీ స్కూల్‌ (పొన్నెకల్లు), ఏ. నిర్మల, ఎంపీపీ స్కూల్‌ (పమిడివారిపాలెం), జి.సుధారాణి, ఎంపీపీ స్కూల్‌ (వరగాని), పి.స్వాతి, ఎంఈఎస్‌ చెంచుపేట (తెనాలి), పి.రజియాబేగం, నగరపాలకసంస్థ ప్రాథమిక పాఠశాల (చిన్నబజారు, గుంటూరు), బి.సమత, ఎంపీపీ స్కూల్‌ (పుల్లడిగుంట).

ఏఎన్‌యూలో ఐదుగురు ఎంపిక

పెదకాకాని(ఏఎన్‌యూ): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఐదుగురు అధ్యాపకులకు రాష్ట్ర ఉత్తమ టీచర్‌ అవార్డులు లభించాయి. ఆచార్య జి. చెన్నారెడ్డి (ఇంగ్లిష్‌), ఆచార్య పి.పి.ఎస్‌.పాల్‌ కుమార్‌ (వ్యాయామ కళాశాల ప్రిన్సిపాల్‌, ఆచార్య ఆర్‌ రమేష్‌రాజు (కెమిస్ట్రీ), ఆచార్య వి. దివ్యతేజోమూర్తి (రూరల్‌ డెవలప్‌మెంటు), డాక్టర్‌ పి. సుధాకర్‌ (బయోటెక్నాలజీ)లకు శుక్రవారం విజయవాడలో జరిగే టీచర్స్‌ డే వేడుకల్లో సీఎం నారా చంద్రబాబునాయుడు అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా అధ్యాపకులకు ఇన్‌చార్జి వీసీ ఆచార్య కె. గంగాధరరావు, రెక్టార్‌ ఆచార్య కె. రత్నషీలామణి, రిజిస్ట్రార్‌ ఆచార్య జి. సింహాచలం, ప్రిన్సిపాల్స్‌ ఆచార్య వీరయ్య, సురేష్‌కుమార్‌, లింగరాజు, ప్రమీలారాణి ఓఎస్‌ అభినందనలు తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement