
అసత్య ప్రచారాలను నమ్మవద్దు
నెహ్రూనగర్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకోచ్చిన నూతన బార్ పాలసీపై కొంత మంది తమ స్వార్థంతో, ఇతరులు కొత్తవారు బార్ బిజినెస్‌లోకి రాకుండా అడ్డుకునేందుకు చెడు ప్రచారం చేస్తున్నారని అటువంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ డెప్యూటీ కమిషనర్ డాక్టర్ కె. శ్రీనివాస్ తెలియజేశారు. ఆదివారం బ్రాడీపేటలోని ఎకై ్సజ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గుంటూరు జిల్లాలో 53 మంది, పల్నాడు జిల్లాలో 24 మంది బార్ లైసెన్సులు తీసుకొని చక్కగా వ్యాపారం చేస్తున్నారని తెలియజేశారు. ఈ నెల 14వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని, 15న కలెక్టరేట్‌లో లాటరీ ద్వారా షాపుల కేటాయింపు జరుగుతుందని తెలిపారు. సమావేశంలో ఈఎస్ అరుణకుమారి, ఏఈఎస్ మారయ్యబాబు పాల్గొన్నారు.