
టీడీపీ నేత ఫరీద్ సలీం వైఎస్పార్ సీపీలో చేరిక
మేడికొండూరు: మండలంలోని తురకపాలెం గ్రామానికి చెందిన మొదటి వార్డు మెంబర్, తెలుగుదేశం పార్టీ నాయకుడు షేక్ ఫరీద్ వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ లో చేరారు. ఆదివారం పేరిచర్లలో జరిగిన కార్యక్రమంలో తాడికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి వనమా బాల వజ్రబాబు సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఫరీద్ సలీం మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి సరైన గుర్తింపు లేకపోవడంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రైతు సంక్షేమం, పేదల అభ్యున్నతి కోసం మాజీ సీఎం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న పోరాటానికి ఆకర్షితుడైనట్లు చెప్పారు. భవిష్యత్తులో గ్రామ ప్రజల అభివృద్ధి కోసం వైఎస్సార్ సీపీ నాయకత్వంలో పనిచేస్తానని తెలిపారు. వనమా బాల వజ్రబాబు మాట్లాడుతూ ‘గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం రోజు రోజుకీ పెరుగుతోందని పేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి పార్టీ కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఫరీద్ లాంటి యువ నాయకులు చేరడం పార్టీకి మరింత బలం చేకూరుస్తుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాడికొండ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ గెలుపు ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, పెద్దఎత్తున పాల్గొన్నారు.