గుంటూరు మెడికల్: బ్రాడీపేటలో బ్రాహ్మణ సేవా సమితి ప్రాంగణంలో బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో 2025–26 సంవత్సరానికి విద్యా పారితోషిక ప్రదానోత్సవం ఆదివారం నిర్వహించారు. కార్యక్రమానికి సమితి అధ్యక్షుడు నందిరాజు పాండురంగారావు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ పాల్గొన్నారు. 252 మంది విద్యార్థులకు రూ.21.50 లక్షలు అందించారు. పాండురంగారావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చక్కగా చదువుకొని ఉన్నత స్థానం పొందిన తరువాత, సమితి వారికి సహాయ సహకారాలు అందజేయాలన్నారు. బ్రాహ్మణ సేవా సమితి కార్యదర్శి ఎం.లక్ష్మీపతి పర్యవేక్షించారు. విద్యా పారితోషికాల చైర్మన్ ఎ.సంజీవరావు, కో చైర్మన్ కర్లపాలెం బాలకృష్ణ, కోశాధికారి తుళ్లూరు ప్రకాష్, ఉపాధ్యక్షుడు మాదల వెంకటకృష్ణ, సహాయ కార్యదర్శులు ఆదిరాజు శ్రీధర్, బొప్పూడి కృష్ణ ప్రసాద్, కార్యవర్గ సభ్యులు పాతూరు శ్రీనాథ్, కోదండ రామారావు, మారుతీ రామ్ గోపాల్, పాంచజన్య శర్మ, కటక రాజు సాయిబాబా శర్మ, గండ్రకోట వెంకటేశ్వరరావు, మద్దూరు రామకృష్ణ పరమహంస, వింజనంపాటి సుబ్రహ్మణ్యం, వి.ఫణీంద్ర కుమార్, అవ్వారి మంగాదేవి పాల్గొన్నారు.