
రైతులకు అండగా ‘అన్నదాత పోరు’
● రైతుల యూరియా కష్టాలపై రేపు తెనాలిలో నిరసన ● తెనాలిలో పోస్టర్ ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే శివకుమార్ ● మంగళగిరిలో ఆవిష్కరించిన సమన్వయకర్త వేమారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు
తెనాలి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ఈనెల 9న రైతులకు అండదండగా ‘అన్నదాత పోరు’ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు పార్టీ తెనాలి సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వెల్లడించారు. ఆర్డీవో కార్యాలయాల వరకు ప్రదర్శనగా వెళ్లి, రైతులకు తగినంత యూరియాను అందించాలనే డిమాండ్‌తో వినతిపత్రం ఇవ్వనున్నట్టు తెలిపారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం పార్టీ నాయకులతో కలిసి అన్నదాత పోరుబాట పోస్టరును శివకుమార్ ఆవిష్కరించారు. అక్కడే విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యతలతో సతమతమవుతున్నట్టు గుర్తు చేశారు. ప్రధానంగా యూరియా దొరక్క రైతులు ఇబ్బందులు పడుతున్నట్టు చెప్పారు. కూటమి ప్రభుత్వం రైతులను అన్నివిధాల నష్టపరుస్తూ, కనీసం యూరియాను కూడా అందించలేని అసమర్థంగా ఉందని విమర్శించారు. ఎక్కడ చూసినా రైతులు యూరియా కోసం బారులు తీరిన దృశ్యాలు రోజూ మీడియాలో కనిపిస్తున్నాయని తెలిపారు. ఈనెల 9వ తేదీన ఉదయం రామలింగేశ్వరపేటలోని ఏ 1 కన్వెన్షను హాలు నుంచి ప్రదర్శనగా సబ్‌కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి, అక్కడ యూరియాను అందించాలన్న డిమాండ్‌తో వినతిపత్రం అందించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీలు పాల్గొనాలని ఆయన ఆహ్వానించారు. ముఖ్యంగా రైతులు భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు దేసు శ్రీనివాసరావు, మండల అధ్యక్షుడు చెన్నుబోయిన శ్రీనివాసరావు, కొల్లిపర మండల అధ్యక్షుడు కల్లం వెంకటప్పారెడ్డి, జిల్లా యూత్ అధ్యక్షుడు ఆళ్ల ఉత్తేజిరెడ్డి, షేక్ గోల్డ్ రహిమ, గుంటూరు కోటేశ్వరరావు, తాడిబోయిన రమేష్, కటారి హరీష్, కొడాలి క్రాంతి, మల్లెబోయిన రాము, పెదలంక వెంకటేశ్వరరావు, అమర్తలూరు సీమోను, షేక్ దుబాయ్ బాబు, దూరు రత్నబాబు, కుదరవల్లి శంకరరావు, ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.
వ్యవసాయాన్ని నిర్వీరం చేయడమే
చంద్రబాబు లక్ష్యం
మంగళగిరి: వ్యవసాయ రంగాన్ని నిర్వీరం చేసి కార్పొరేట్లకు దోచిపెట్టడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ధ్వజమెత్తారు. మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆత్మకూరు జాతీయ రహదారి వెంట కల వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కార్యాలయంలో ఆదివారం అన్నదాత పోరు వాల్ పోస్టర్లును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వేమారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు గతంలో వ్యవసాయం దండగ అని చెప్పారని గుర్తు చేశారు. ఇప్పడు వరి సాగు చేయవద్దని మరోసారి తన మనస్సులోని మాటను బయటపెట్టారన్నారు. అన్నపూర్ణగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్‌ను ఎడారిగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తెనాలిలో జరిగే అన్నదాత పోరుబాట కార్యక్రమంలో నియోజకవర్గ రైతులతో పాటు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేసి, ప్రభుత్వం కళ్లు తెరిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ రైతులు యూరియా, ఎరువులు అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు బందాపు రుక్మాంగరెడ్డి, మంగళగిరి పట్టణ, రూరల్, తాడేపల్లి పట్టణ, రూరల్, దుగ్గిరాల మండల పార్టీ అధ్యక్షులు ఆకురాతి రాజేష్, నాలి వెంకటకృష్ణ, బుర్రముక్క వేణుగోపాలస్వామిరెడ్డి, అమరా నాగయ్య, తాడిబోయిన శివగోపయ్య, నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షుడు దుర్గానాయక్, సోషల్ మీడియా విభాగ అధ్యక్షుడు భీమిరెడ్డి శరణ్‌కుమార్ రెడ్డి, జిల్లా యాక్టివ్ సభ్యురాలు మల్లవరపు సుధారాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదులమూడి డేవిడ్ రాజు, నాయకులు జంగా నాగిరెడ్డి, ఊట్ల పాలశ్రీనివాసరావు, ధనుంజయ్, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

రైతులకు అండగా ‘అన్నదాత పోరు’